సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలం

సీపీఐ నేతల విమర్శ

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

పేదల సమస్యలు పరిష్కరించాడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అయ్యాయని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్. గురుదాసు, సీపీఐ మండల, పట్టణ కార్యదర్సులు డి. రాజా సాహెబ్, బి. సురేంద్ర కుమార్ లు అన్నారు.సీపీఐ డిద్దీ చేను కొట్టాల కాలనీ శాఖ సమావేశం ఆ శాఖ సహాయ కార్యదర్శి డి. అశోక్ అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశం నకు ముఖ్య అతిధులుగా హాజరైన ఆర్. గురుదాసు, డి. రాజా సాహెబ్, బి. సురేంద్ర కుమార్ లు మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్, పెట్టుబడి దారుల అనుకూల నిర్ణయాలు తీసుకోవడం వల్ల పేద మధ్య తరగతి ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నరని ఆందోళన వెలిబుచ్చారు. వ్యవసాయన్ని ప్రవేటీ కారణ చేసిరైతుల కడుపు కొట్టే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందని అన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పట్టాలు కేవలం తమ పార్టీ కార్యకర్తలు కు మాత్రమే ఇస్తున్నదని ఆరోపించారు. నిజమైన పేదవారికి, అర్హులైన వారికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సమావేశంలో సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు ఎం. కారన్న, ఎన్. కృష్ణయ్య, ఎం. కే. సుంకన్న, నెట్టేకంటెయ్య తదితరులు పాల్గొన్నారు.

డిద్దీ చేను కొట్టాల కాలనీ శాఖనూతన కమిటీ ఎన్నిక

పత్తికొండ పట్టణంలోని డిద్దీ చేను కొట్టాల కాలనీ శాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కార్యదర్శిగా ఎన్. రామాంజనేయులు, సహాయ కార్యదర్సులు గా డి. అశోక్, బి. రవి. యు. లక్మి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: