రెండు వరుసల రోడ్డు పనులను పరిశీలించిన...

నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

రెండు వరుసల రోడ్డు పనులను నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి పరిశీలించారు. సోమవారం పులిమది గ్రామ సమీపంలో రెండు వరుసల రోడ్డు పనులను నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి,  రహదారులు మరియు భవనాల శాఖ ఈఈ,  డిఈలతో కలిసి పరిశీలించారు.
నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమార్ మాట్లాడుతూ నంద్యాల పట్టణం రహదారి నుండి వయా పులిమద్ది మీదుగా  నందికొట్కూర్  ఆత్మకురు రోడు వరకు నిర్మించనున్న రెండు వరసల రోడ్డు పనులను ఈరోజు పులిమద్ది గ్రామ సమీపంలో భూసేకరణపై, రోడ్డు నిర్మాణాలపై రహదారులు, భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని ఆమె అన్నారు. వీరి వెంట నంద్యాల  మండలం తహసీల్దార్ కార్యాలయం వీఆర్వోలు విజయ శేఖర్, నాగరాజు సర్వేలు సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు.
అలాగే యాలూరు గ్రామ సమీపంలో రెండు వరుసల రోడ్డు పనులను నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి రహదారులు, భవనాల శాఖ ఈఈ, డిఈ, గోస్పాడు తాసిల్దార్ లతో కలిసి పరిశీలించారు. నంద్యాల సబ్ కలెక్టర్  కల్పనా కుమార్ మాట్లాడుతూ సిరివెళ్ల జాతీయ రహదారి నుండి గోస్పాడు మండల కేంద్రానికి నిర్మించనున్న రెండు వరసల రోడ్డు పనులను యాలూరు గ్రామ సమీపంలో భూసేకరణపై,  రోడ్డు నిర్మాణాలపై రహదారులు, భవనాల శాఖ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని ఆమె అన్నారు. వీరి వెంట గోస్పాడు మండలం తహసీల్దార్, వీఆర్వోలు సర్వేలు సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: