కరోనా జాగ్రత్తలు పాటించాలి

బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు రాజు 

(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు రాజు కోరారు. కోర్టుకు హాజరు అయ్యే ప్రతీ ఒక్కరూ విధిగా మాస్క్ , తమ తమ సొంత సానిటైజ్ లతో రావాలని తెలిపారు. సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తు చేశారు. కోర్టుకు హాజరు అయ్యే  క క్షిదారులు మాత్రమే రావాలని, వారివెంట ఇతరులు రాకూడదని సూచించారు. గుంపులు, గుంపులుగా నిలబడి పిచ్చాపాటీ కబుర్లకు తావివ్వకుండా, కోర్టు పని ముగించుకుని కోర్టు ప్రాంగణం నుండి వెళ్లి పోవాలని అన్నారు. ప్రతీ ఒక్కరూ విధిగా కరోనా జాగ్రత్తలు పాటించి న్యాయ వాదులకు, పోలీసు సిబ్బందికి, కోర్టు సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. 

✍️రిపోర్టింగ్ -డి.అనంత రఘు

అడ్వకేట్-హైదరాబాద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: