పీఈటీలకు పీడీలుగా పదోన్నతి కల్పించండి 

తెలంగాణ రాష్ట్ర  విద్యా శాఖ మాత్యులు సబితా ఇంద్రా రెడ్డిని కోరిన టీజీపీఇటీఏ

(జానోజాగో వెబ్ న్యూస్, హైదరాబాద్ బ్యూరో)

తెలంగాణ వ్యాయామ ఉపాధ్యాయ సంఘం (టీజీపీఇటీఏ) ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర  విద్యా శాఖ మాత్యులు సబితా ఇంద్రా రెడ్డిని వారి గృహం వద్దకలిసి రాష్ట్ర కమిటీ వినతిపత్రం అందజేయడం జరిగింది. జీవో నెంబర్ 11 & 12 సవరించి, జీవో నెంబర్ 15 అమలు చేసి,  దాని ఆధారంగా  పీఈటీలను ఫిజికల్ డైరెక్టర్లు పీడీ)లుగా పదోన్నతి కల్పించాలని కోరడం జరిగింది. గౌరవ విద్యా శాఖ మాత్యులు సబితా ఇంద్రా రెడ్డితో  రాష్ట్ర అధ్యక్షుడు తునికి విజయసాగర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు దుమర్ల నిరంజన్ , మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సిద్దార్థ లు, సుదీర్ఘంగా అప్ గ్రేడేషన్ పైన పూర్తి స్థాయిలోచర్చించిన అనంతరం సబితా ఇంద్రా రెడ్డి  వెంటనే స్పందించి విద్యశాఖ అధికారులకు ఫోన్ చేసి 11 & 12 జీవో కలిగిన ఫైలును సవరించడానికి కావాల్సిన లీగల్ అంశాలను సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు, మరియు  తుది  నిర్ణయం త్వరలో సీఎం కేసీఆర్ తో జరిగే విద్యాశాఖ ,ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం  నిర్వహిస్తామని అందులో మన  పీఈటీల అప్ గ్రేడేషన్ అంశాన్ని చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న ఆశాభావం వ్యక్తం చేశారు.


ఇంకా అన్ని ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పీడీ పోస్టులు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పీఈటీల పోస్టులు వెంటనే మంజూరు చేయాలని, అలాగే పాఠశాల క్రీడలు నిర్వహించటం కోసం  పెండింగులో ఉన్న బిల్లుల కోసం బడ్జెట్ ను కేటాయించి మంజూరు చేయాలని విద్యా శాఖ మాత్యులు సబితా ఇంద్రా రెడ్డి గారికి విన్నవించినట్టు  రాష్ట్ర అధ్యక్షుడు తునికి విజయసాగర్ తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయ సంఘం పక్షాన తెలంగాణ రాష్ట్ర  విద్యా శాఖ మాత్యులు సబితా ఇంద్రా రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని రాష్ట్ర అధ్యక్షుడు తునికి విజయసాగర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు నిరంజన్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు.  తెలంగాణ రాష్ట్ర  విద్యా శాఖ మాత్యులు సబితా ఇంద్రా రెడ్డిని కలిసినవారిలో  రాష్ట్ర అధ్యక్షుడు తునికి విజయసాగర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు నిరంజన్ , మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సిద్దార్థ లతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరుమల రెడ్డి సుధాకర్ రెడ్డి తో పాటు తెలంగాణ వ్యాయామ విద్య ఉపాధ్యాయు సంఘం ప్రతినిధులు సాబీర్, చారి, నాగరాజు తదితరులు ఉన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: