ఘనంగా నటభూషణ్...

శోభన్ బాబు 85వ జన్మదినం

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

 దివంగత నటుడు నటభూషణ శోభన్ బాబు 85వ జన్మదినం సందర్బంగా శోభన్బాబు సేవా సమితి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా  నంద్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జంగిటి నర్సింహా యాదవ్,  చింతల మోహన్ రావులు పాల్గొని శోభన్ బాబు చిత్ర పటానికి పూల మాల వేసి కేకు కట్ చేసి, క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ ఆయన నటించిన చిత్రాల గురించి వివరించారు. అనంతరం టీచర్లను శాలువాలు, శోభన్ మెమోటోలతో సత్కరించారు.

ఈ  కార్యక్రమంలో ఉపాధ్యాయులు లలిత సరస్వతి,  శ్రీలక్ష్మి, శ్రీధర్, ప్రసాద్, అగస్టీన్లతో పాటు సీనియర్ విలేకర్ విశాలాంధ్ర  ఉస్మాన్ భాషలను సన్మానించడం జరిగింది. అనంతరం దాసరి చింతలయ్య మాట్లాడుతూ శోభన్ బాబు సేవాసమితి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం శోభన్ బాబు జన్మదినం సందర్భంగా ప్రజా సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో శోభన్ బాబు సేవా సమితి అభిమానులు రమణ,  దాసరి చింతలయ్య, అన్నయ్య,  జానకిరామ్, లక్ష్మయ్య గౌడ్,  అల్లాబకాష్, అయూబ్, శంకర్ రెడ్డి. తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: