ఈ నెల 27న పత్తికొండలో..

ఓసి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం 

ఓసి  జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడు వై పి వీరన్న

(జానోజాగో వెబ్ న్యూస్-పత్తికొండ ప్రతినిధి)

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓసీలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయాలని కోరుతూ పత్తికొండ పట్టణంలో నీ అమ్మవారి శాల కళ్యాణ మండపము నందు బుధవారం ఉదయం 10 గంటలకు సమావేశం జరుగుతున్నట్లు ఓసి  జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుడు వై పి వీరన్న తెలిపారు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓసీలకు  10 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంతవరకూ వాటిని అమలు చేయలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు అందువల్ల నియోజకవర్గంలోని కమ్మ  రెడ్డి  బలిజ  ఆర్యవైశ్య  బ్రాహ్మణులు ఈ సమావేశానికి హాజరుకావాలని ఆయన కోరారు ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన 10 శాతం రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్యచరణ ప్రణాళికను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు అందువల్ల అందరూ హాజరు కావాలని ఆయన కోరారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: