పివిఆర్ పిక్చర్స్ ద్వారా ఫిబ్రవరి 26న....

భారీ గా విడుదల కాబోతున్న "A" !!

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

నితిన్ ప్రసన్న హీరోగా ప్రీతి అస్రాని హీరోయిన్ గా అవంతిక ప్రొడక్షన్స్ పతాకంపై యుగంధర్ ముని దర్శకత్వంలో గీతా మిన్సాల నిర్మించిన డిఫరెంట్ థ్రిల్లర్ చిత్రం “A”. ఈ చిత్రం టీజర్స్ కి వండర్ ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్స్, టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో A సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి.. అందరి ఎక్స్ పెక్టషన్స్ కి ధీటుగా దర్శకుడు యుగంధర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. U/A సర్టిఫికెట్ సాధించి.. సెన్సార్ సభ్యుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న అత్యధిక థియేటర్స్ లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని పివిఆర్ పిక్చర్స్ సంస్థ సినిమా చూసి ఎంతో ఇన్స్పైర్ అయి A చిత్రాన్ని రిలీజ్ చేయడం విశేషం.. ఈ సందర్బంగా..

చిత్ర దర్శకుడు యుగంధర్ మాట్లాడుతూ..' ఇప్పటివరకు థ్రిల్లర్ జోనర్స్ లో చాలా మూవీస్ వచ్చాయి. వాటన్నిటి కంటే భిన్నంగా మా A సినిమా ఉంటుంది. సెన్సార్ సభ్యులు మూవీ చూసి.. చాలా కొత్తగా అద్భుతంగా ఉంది. చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని అభినందించారు. ప్రేక్షకులకు కూడా అలాంటి అనుభూతి కలుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొత్తధనంతో ఏ సినిమా తీసినా ఆదరిస్తామని ప్రేక్షకులు ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు. నితిన్ ప్రసన్న, ప్రీతి అస్రాని పెయిర్ చాలా బాగుంది. ఇద్దరూ పోటాపోటీ గా నటించారు. మా నిర్మాత గీతా గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనంత శ్రీరామ్ పాటలు మరియు ఆయన సపోర్టు వల్ల ఈ సినిమా బాగా రావటం జరిగింది. ప్రవీణ్ బంగారి ఫోటోగ్రఫీతో పాటు విజయ్ కురాకుల మ్యూజిక్, ఆనంద్-పవన్ ఎడిటింగ్ మా చిత్రానికి హైలెట్ గా నిలుస్తాయి.. చిన్న సినిమా అయినా సినిమా నచ్చి పివిఆర్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ మూవీ దర్శకుడిగా నాకు మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాను.. అన్నారు.

నిర్మాత గీతా మిన్సాల మాట్లాడుతూ..' యుగంధర్ ముని చెప్పిన కథ నచ్చి 'A' చిత్రాన్ని బడ్జెట్ కి వెనకాడకుండా నిర్మించాం. టెక్నికల్ గా, విజువల్స్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ మంచి సినిమా కోసం తమవంతు సహకారం అందించారు. టీజర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై క్రేజ్ బాగా పెరిగింది. అంచనాలకు మించి ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా యుగంధర్ ముని ఈ చిత్రాన్ని రూపొందించారు. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అలాగే పివిఆర్ లాంటి బిగ్ బ్యానర్ ద్వారా మా చిత్రం ఫిబ్రవరి 26న రిలీజ్ అవుతుంది.. అన్నారు.

 

సినిమాటోగ్రాఫర్ ప్రవీణ్ కె బంగారి (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ డిజైన్ బినిల్ అమక్కాడు (ఎస్‌ఆర్‌ఎఫ్‌టిఐ), సౌండ్ మిక్సింగ్ సినాయ్ జోసెఫ్ (నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్) మరియు ఎడిటింగ్ ఆనంద్ పవన్ & మణికందన్ (ఎఫ్‌టిఐఐ). సంగీతం విజయ్ కురాకుల. నిర్మాత; గీతా మిన్సాల, దర్శకత్వం; యుగంధర్ ముని.  

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: