పత్తికొండ లో ఘనంగా ఎన్టీఆర్ 25వ వర్ధంతి
(జానోజాగో వెబ్ న్యూస్ -పత్తికొండ ప్రతినిధి)
పత్తికొండ పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సోమవారం తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రివర్యలు, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 25వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ,అభిమానులు ముందుగా గుత్తి రోడ్ లో ఉన్న మార్కెట్ యార్డ్ దగ్గర వున్నటువంటి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పిచడం జరిగింది. అనంతరం పత్తికొండ పట్టణంలోని తెలుగదేశం పార్టీకార్యాలయ ఆవరణంలో మెగా లెజండరీ రక్తదాన శిభిరం నిర్వహించడం జరిగింది.
స్థానిక తెలుగుదేశం కార్యాలయంలో ఏర్పాటుచేసిన మెగా లెజండరి రక్తదాన శిబిరంలో యువ కార్యకర్తలు 34 మంది రక్తదానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జిల్లా ఉపాధ్యక్షులు సాంబశివ రెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిన వెంకట రాముడుటీడీపీ మండల అధ్యక్షులు బత్తిన లోకనాథ్ తెలుగుదేశం నాయకులు మనోహర్ చౌదరి , కొట్టాల రవి, అశోక్ కుమార్,ఎస్సీ సెల్ నాయకులు తిరుపాల్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: