శిల్పా మహిళా సహకార్ ద్వారా 239 మంది...

మహిళలకు ₹27 లక్షల రుణం

పంపిణీ చేసిన మహిళా బ్యాంక్ చైర్మన్ శిల్పా నాగిని రెడ్డి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ప్రతి కుటుంబంలో మహిళ ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తుందని..తనకు మా వంతు సహాయం చేయగలిగితే ఆ కుటుంభం సంతోషంగా ఉంటుందని శిల్పా సహకార బాంక్ ద్వారా రుణాలను మీకు అందజేస్తున్నాం అని ఛైర్మెన్ నాగిని రెడ్డి తెలిపారు. ఈరోజు అధిక సంఖ్యలో మహిళలు మా బ్యాంక్ ద్వారా రుణాలు   తీసుకుంటున్నారని మీ అభివృద్ధిలో మా వంతు సహకారం ఉండడం వల్ల నాకు ఎంతో గర్వాంగా ఉందని నాగిని రెడ్డి తెలిపారు.
అలాగే వార్డులలో టైలరింగ్ సెంటర్లు చేతి వృత్తి నేర్చుకునేవారికి ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించి మరింత మందికి రుణాలు అందే విధంగా సహకరించాలని మహిళను కోరారు.అనంతరం శిల్పా మహిళ బ్యాంక్  లబ్దిదారులు మాట్లాడుతూ శిల్పా మహిళ బ్యాంక్ ద్వారా రుణాలు తీసుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉన్నామని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికీ  శిల్పా నగిని రెడ్డికీ ప్రతేక ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, శిల్పా సేవసమితి మేనేజర్ లక్ష్మి నారాయణ, బ్యాంక్ మేనేజర్ హరిలీల, శిల్పా మహిళ బ్యాంక్ మహిళ సభ్యులు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: