వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా...
జనవరి 19న కార్మిక కర్షక ఐక్యతా దినం
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్న పోరాటంలో భాగంగా జనవరి 19న కార్మిక ,కర్షక ఐక్యత దినాన్ని రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో జరపాలని నిర్ణయించామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి భూపాల్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు తెలిపారు.
శనివారంనాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ....కార్పొరేట్ సంస్థలు, విదేశీ బహుళజాతి సంస్థలకు వ్యవసాయరంగాన్ని అప్పగించేందుకు మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. అంబానీ, అదానీల కోసమే మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చిందని చెప్పారు. ఈ చట్టాలను రద్దు చేసే వరకూ పోరాటం ఆగదనీ, మరింత ఉధృతమవుతుందని అన్నారు. ఇది రైతాంగం కోసమే కాకుండా 130 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమస్యలపై పోరాటం జరుగుతున్నదని వివరించారు. వ్యవసాయరంగానికి చేటు తెచ్చే మూడు చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలు, విదేశీ బహుళజాతి సంస్థలు, సామ్రాజ్యవాద శక్తులకు వ్యవసాయరంగాన్ని అప్పగించేందుకు ఈ చట్టాలను తెచ్చిందని విమర్శించారు. ఎంతైనా నిల్వ చేసుకునీ, బ్లాక్‌మార్కెట్‌కు లైసెన్స్ ఇస్తున్నారని వివరించారు. కార్పొరేట్లకు అప్పగించేందుకు మార్కెట్ కమిటీలను రద్దు చేస్తున్నారని చెప్పారు. మద్దతు ధర లేకుండా వ్యాపారుల దయాదాక్షిణ్యాల మీద రైతులు బతకాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు భవిష్యత్తులో మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్డీయే మిత్రపక్ష పార్టీలూ ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఇంతకాలం మోడీకి అనుకూలంగా ఉన్న టీఆర్‌ఎస్ ఇప్పుడు వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడాన్ని స్వాగతించారు. రైతాంగం నడ్డివిరిచే ఈ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మందబలంతో పార్లమెంటులో చట్టాలను ఆమోదించి రైతులకు ఉరితాడు బిగిస్తున్నారని విమర్శించారు. మద్దతు ధర లేకుండా, మార్కెట్ కమిటీల్లేకుండా అంబానీ, అదానీలకు వ్యవసాయరంగాన్ని అప్పగిస్తున్నారని చెప్పారు. మోడీ సర్కారు మాటలను ఎవరూ నమ్మరనీ, ఈ చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ చట్టాలతో వ్యవసాయరంగంపై గుత్తా కార్పొరేట్ సంస్థల ఆధిపత్యం పెరుగుతుందని ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు కొనాలని కోరారు. రైతు బజార్లు కాకుండా రిలయెన్స్ మార్ట్‌లుండాలని చట్టాలు తెస్తున్నారని విమర్శించారు. సొంత భూమిలోనే రైతులు కూలీలుగా మారతారని అన్నారు. జనవరి 18న జరుగు మహిళా రైతుల ప్రదర్శనలను, 23 నుండి 25 వరకు జరుగు మహా పడవలను 26న జరుగు గవర్నర్, కలెక్టర్ కార్యాలయాలకు మార్చ్ ను జయప్రదం చేయాలని కోరారు.
Post A Comment:
0 comments: