సీపీఐ ఆధ్వర్యంలో...
జీవో196.197.198పత్రులను భోగిమంటల్లో దగ్ధం చేసిన ప్రజాసంఘాలు
(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ప్రజావ్యతిరేక జీవో లు 196.197.198పత్రులను సీపీఐ ఆధ్వర్యంలో బోగి మంటల్లో దగ్ధం చేశారు. సీపీఐ నాయకుడు దాదాపీర్ అధ్యక్షతన ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ కాంగ్రెస్ యువజన నాయకుడు సంపత్ కుమార్ భోగిమంటల్లో దగ్ధం చేశారు దాదా పీర్ మాట్లాడుతూ
ప్రజావ్యతిరేక జీవోలు వెనక్కు తీసుకునే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ దేశ జాతీయ ఆస్తులు కార్పొరేట్ అదానీ అంబానీలు ధారాదత్తం చేస్తూ. మున్సిపాలిటీలు కూడా భవిష్యత్తు లో కార్పొరేట్ లకు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నట్లు ప్రభుత్వ విధానాలు ఉన్నాయని అన్నారు ఆస్తివిలువ ఆధారంగా ఇంటి పన్ను విధానం రద్దు చేయాలని. ఇంటిపన్ను కొళాయి పన్ను.చెత్త పన్ను పెంచడం దారుణమని ప్రజలను జలగల్లా పీల్చే ఇలాంటి పన్నులు వెంటనే గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించి ప్రజల పక్షాన నిలబడాలని విజ్ఞప్తి చేశారు .రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకుడు సంపత్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి జీవో లను ప్రజలపై రుద్దుతూ ప్రజా వ్యతిరేక విధానాలు చట్టాలు చేసే ప్రభుత్వాలు ఎక్కువ కాలం మనుగడ సాగించవని అన్నారు అనంతరం హిందూపురం మున్సిపల్ కార్యాలయం బయట సంక్రాంతి భోగిమంటల్లో జీవో కాపీలను దగ్ధం చేశారు ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ సుభానీ బాబాజాన్. ఏఐటీయూసీ నయాజ్ అతావుల్లా నాగరాజు. టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ షేఖ్ షబ్బీర్ పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: