పట్టణ ప్రజల పై భారం సరికాదు

భారం మోపే ఆస్తి పన్ను జీవో నెంబర్ 196 197 198 ని వెంటనే రద్దు చేయాలి

వామపక్ష పార్టీలు, జానోజాగో, ఐయూఎంఎల్ డిమాండ్

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

పట్టణ ప్రజల పై ఆస్తిపన్ను భారాన్ని మో పదల సుకున్న జీవో నెంబర్ 196 197 198 ని రద్దు చేయాలని సిపిఐ పార్టీ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జానో జాగో imul  పార్టీల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళితే మున్సిపల్ ఆఫీస్ కార్యాలయంలో ఏ అధికారి లేకపోవడం వలన వినతి పత్రాన్ని మున్సిపల్ కార్యాలయ ఆఫీసుకు అతికించడం జరిగిందని సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ బాబా ఫక్రుద్దీన్ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యదర్శి శంకర్ జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, ఐయూఎంఎల్ నాయకులు ఎస్  ఎం డి  ఉమర్ సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ధనుంజయుడు సిపిఐ పార్టీ పట్టణ సహాయ కార్యదర్శి షరీఫ్ భాష వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి సుబ్బరాయుడు రైతు సంఘం కార్యదర్శి సోమన్న ఏ ఐ టి యు సి అధ్యక్షులు శ్రీనివాసులు భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు మహమ్మద్ ఐ యు ఎన్ ఎల్ నాయకులు  సాజిద్ తెలిపారు.
అనంతరం నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ  ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రజల పై ఆస్తిపన్ను భారాలు మోసే ప్రయత్నం చేస్తుంది ఈ  ప్రయత్నాన్ని విరమింప చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళితే మున్సిపల్ కార్యాలయంలో ఏ ఒక్క అధికారి లేకపోవడం విచారకరమని అన్నారు పట్టణంలో సమస్యల పైన మున్సిపల్ కార్యాలయానికి వెళితే అధికారులు తమ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు కనీసం అధికారులు పని మీద బయటకి వెళ్లేటప్పుడు కనీసం ఒక్క అధికారి అన్నా ఆఫీసులో ఉండి ప్రజా సమస్యలను పట్టించుకోవాలని అన్నారు ఈరోజు జరిగిన సంఘటన మరల జరిగితే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తాం అని హెచ్చరించి వినతిపత్రాన్ని మునిసిపల్ కమిషనర్ కార్యాలయం గోడకు అతికించడం జరిగిందని అన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: