తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ ???...,

ఫిబ్రవరి 18వ తేదీన ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు???..,

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)

తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా కె.తారక రామారావు వచ్చేనెల ఫిబ్రవరి 18 వ తేదీన ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. పురోహితులు ఏర్పాటు చేసిన ముహూర్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పదవీ బాధ్యతలు స్వీకరించే తేదీకి ముందుగా యాగాలు నిర్వహించేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆయుత చండీ యాగం, రాజశ్యామల యాగం నిర్వహించే దిశగా పురోహితులు ఏర్పాట్లు పూర్తి చేయాలని కోరినట్లు తెలిసింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బాధ్యతలను మేనల్లుడైన హరీష్ రావు కు అప్పగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. సీనియర్ నేతలు గుత్తా సుఖేందర్ రెడ్డి తో పాటు ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీ ల ఆభిప్రాయాలు సైతం పరిగణలోకి తీసుకుని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాబోవు శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కసరత్తు చేస్తున్నారని నిపుణుల అభిప్రాయం. ఇప్పటినుండి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని యోచిస్తున్నారు. 2023 ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి తీసుకునే ప్రణాళికలను సిద్ధం చేశారని, నిపుణుల సలహా, సూచనల మేరకు వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది.

✍️ రచయిత--డి.అనంత రఘు

అడ్వకేట్--హైదరాబాద్

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: