సంక్రాంతి సందర్భంగా జనవరి 15 న.. 

ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న “సైకిల్ ” 

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

పునర్నవి భూపాలం ,మహత్ రాఘవేంద్ర ,శ్వేతావర్మ ,సూర్యభరత్ చంద్ర లీడ్ రోల్స్ లో , పి .రాంప్రసాద్ .వి బాలాజీరాజు  ,నిర్మాణంలో ,ఆట్ల అర్జున్ రెడ్డి  రచన -దర్శకత్వంలొ ,  తెరకెక్కించిన చిత్రం “సైకిల్ ” ఈ సినిమా  అనూహ్యంగా సంక్రాంతి బరిలో జనవరి 15 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది . ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు అర్జున్ రెడ్డి  మాట్లాడుతూ ఉత్తర భారత దేశంలోని కొన్ని వింత యధార్థ సంఘటనల ఆధారంగా అల్లుకున్న కథ అని , సంక్రాంతికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుందని చెప్పారు.అలాగే హీరో హీరోయిన్స్ తో
పాటు ఈ చిత్రంలో నటించిన ,అనితా చౌదరి , మధుమని ,సుదర్శన్ ,నవీన్ నేని , ఆర్ఎక్స 100లక్ష్మణ్ ,అన్నపూర్ణమ్మ , తో పాటు అందరి క్యారెక్టర్స్ ఎంటర్టైన్ చేస్తాయని , ఇంత పెద్ద కాంపిటేషన్ లోకూడా మా చిత్రం ఖచ్చితంగా ఓక డిఫరెంట్ ఎంటర్టైనర్ అవుతుందని ధీమా వ్యక్తం చేసారు ,ప్రస్తుత పరిస్థితుల్లో 50శాతం మాత్రమే సీటింగ్ ఆక్యూపెన్సీ ఉన్నప్పటికీ మా సినిమాని నమ్మి ముందుకొచ్చిన డిస్ట్రిబ్యూటర్ల సహాయ , సహకారాలతో 75 స్క్రీన్ లలో తెలుగు రాష్ట్రాలలోని థియేటర్స్ లొ విడుదల చేస్తున్నాము,అలాగే ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు ప్రేక్షకులందరికీ చిత్రాన్ని చేరువచేసే ప్రయత్నం చేస్తున్నాము , ఈ చిత్రం మీఅందరికి నచ్చుతుందని ,విజయవంతం చేస్తారని భావిస్తున్నాము.

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: