నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో...
ఘనంగా స్వామీ వివేకానంద 158 వ జయంతి ఉత్సవాలు
(జానోజాగో వెబ్ న్యూస్-లీగల్ ప్రతినిధి)
నాంపల్లి క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారంనాడు స్వామీ వివేకానంద 158 వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామీ వివేకానంద ఫోటోకు పూలదండ వేసి నివాళ్లులర్పించారు.అనంతరం బార్ అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఆయన చేసిన విశేష సేవలను కొనియాడారు. యువత స్పూర్తిప్రధాత స్వామీ వివేకానంద అని వారు పేర్కొన్నారు. ఆయన ప్రభావం దేశంలోని అనేక మందిపై ఉందన్నారు. స్వామీ వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్రిమినల్ కోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి బాల్ రాజ్ గౌడ్, అసోసియేషన్ నాయకులు రాజ్ కుమార్, శ్రీనాథ్, కరికే మల్లేష్, చింతల కృష్ణ, కె.ఆనంద్ గౌడ్, శ్రీనాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: