ఆలిండి యా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు...
15 న రాజ్ భవన్ ముట్టడి...
11న కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు
పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)
ఆలిండియా కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ఈ నెల 15 వ తేదీన రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆదివారం గాంధీ భవన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో తీర్మానించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన రైతుల వ్యతిరేక విధానాలను ఖండిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ల కార్యాలయాల ముందు సోమవారం నాడు ధర్నా నిర్వహించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ లో ఇప్పటవరకూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ ప్రధాని మోదీ వారి గోడు పట్టించుకోక పోవడం విచారకరం అన్నారు. భారత దేశం రైతులపై ఆధారపడి జీవిస్తున్న విషయాన్ని గుర్తించాలని తెలిపారు. చలి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారని, వెంటనే చట్ట వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఓ వైపు రైతులు ప్రాణాల్ని కోల్పోతున్నారని, ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం శోచనీయం అన్నారు. తక్షణం ప్రధాని మోదీ రైతుల ఆందోళనలు విరమించెలా సానుకూల చర్చలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని ఆయన హెచ్చరించారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు తీవ్రతరం చేస్తామని అన్నారు.
✍️ రిపోర్టింగ్ -డి.అనంత రఘు
అడ్వకేట్-హైదరాబాద్
Post A Comment:
0 comments: