ట్రాక్టర్ పెరేడ్ కు సంఘీభావం గా...

 హిందూపురంనుంచి దాదాపు 100ట్రాక్టర్లతో పయనం

రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయం

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 26న జరిగే ట్రాక్టర్ పెరేడ్ కు సంఘీభావం గా  హిందూపురంనుంచి దాదాపు 100ట్రాక్టర్లతో పాల్గొన్నాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయం తీసుకొంది. ఢిల్లీ లో సుదీర్ఘ రైతాంగ పోరాటానికి మద్దతుగా వ్యవసాయ చట్టాలను రద్దు పరచాలని కోరుతూ వ్యవసాయ  , రైతు  , అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో ఆల్ హీ లాల్ స్కూల్ నందు శనివారంనాడు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. 

ఆవాజ్ఇంతియాజ్ అధ్యక్షతన ఈ కార్యక్రమము జరిగింది సుబ్బిరెడ్డి రైతు సంఘం జిల్లా కార్యదర్శి.పాల్గొన్నారు రైతు ప్రజా సంఘాల అఖిలపక్షం కన్వీనర్ గా చైతన్య గంగిరెడ్డి ని ఏకగ్రీవంగా ప్రజసంఘాలు రైతులు ఎన్నుకున్నాయి. 26నఢిల్లీలో జరిగే ట్రాక్టర్ పెరేడ్ కు సంఘీభావం గా హిందూపురంలో దాదాపు 100ట్రాక్టర్లతో రైతులు ప్రజాసంఘాలు పాల్గొంటాయని రైతులు అన్నారు ఢిల్లీ వెళ్లి రైతులకు సంఘీభావం తెలిపే కార్యక్రమం కూడా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉమర్ ఫారూఖ్ ఖాన్. కాంగ్రెస్ నాయకులు అమానుల్లా. జమీల్. ఎన్ఎస్యూఐ నాయకులు సంపత్, బీఎస్పీ నాయకులు హనుమంతు. శ్రీరాములు. సీపీఎం నాయకులు. కార్మిక నాయకులు.రవి. రైతు సంఘం సిద్దారెడ్డి. ఎస్ ఎఫ్ ఐ బాబావలీ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, సీఐటీయూ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 26వతేదీన రైతు పచ్చ కండువా జాతీయ జెండా తో కార్యక్రమం సాగుతోందని నిర్వాహకులు తెలిపారు.


 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: