ఆ పుస్తకాలు చదవండి..

ఇస్లాం చక్కటి జీవన విధానం అని తెలుసుకోండి

ముస్లింలు...ఇస్లాంగురించి టాప్ 10 పుస్తకాలు 

(Top 10 Books About Muslims And Islam)

అపోహ...ఇది వ్యక్తుల జీవితాలను నాశనం చేయడమే కాదు సమాజాన్ని కూడా నాశనం చేస్తుంది. మన ప్రపంచంలో ఒకరిపై ఒకరికి కలిగే ధ్వేషానికి కారణాలు అనేకమైతే వాటిలో అపోహ అన్నది ప్రధానమైంది. అందుకే అపోహలను తొలగించుకోవాలి. వాస్తవం ఏమిటో తెలుసు కోవాలి. శాస్త్రీయత, విద్య వ్యాప్తి చెందుతున్నా నేటికి ఒక సమాజంపై మనం అపోహపెంచుకోవడం శోచనీయం. ఇలాంటి అపోహనే ఇస్లాంపై సమాజంలోని కొందరిలో నెలకొనివుంది. వాస్తవంగా ఇస్లామంటే ఏమిటో పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడానికి వీలున్నా ఆ ప్రయత్నం సాగడంలేదు. అలాంటి వారి కోసమే కొన్ని ప్రత్యేక పుస్తకాలు ఉన్నాయి. వాటిని చదివితే ఇస్లాం ఓ చక్కటి జీవిన విధానం అన్న అభిప్రాయం కచ్చితంగా కలుగుతుంది.

ప్రింట్ మీడియా/ఎలెక్ట్రానిక్ మీడియా లో  ముస్లింలు గురించి తప్పుగా రాయడం/చిత్రీకరించడం  కొత్త ఏమీ కాదు. నేడు ప్రపంచంలో, అనేక మందికి ముఖ్యంగా  అమెరికన్లకు ఇస్లాం గురించి తెలియదు. ప్రపంచం లోని అధిక శాతం  మంది ప్రజలు ముస్లింల గురించి తెలుసుకోవాలి అనుకొంటున్నారు. నా ఉద్దేశం లో ముస్లిమ్స్  గురించి చదవడం కన్నా వారిని ప్రతక్షం గా కలవడం ద్వారా పరిచయాలు ఏర్పరచుకోవడం ద్వారా వారి గురించి ఎక్కువ అవగాహన ఏర్పరచుకోవచ్చు. ఉదాహరణకు, "ముస్లిం " లేదా "ఇస్లాం "గురించి మార్కెట్ లో అనేక బుక్స్ ఉన్నాయి. కానీ అవి ముస్లిమ్స్ గురించిన  నిజాలు వేల్లడించడం లేదు.

నిజానికి ముస్లిమ్స్ గురించి వాస్తవాలు ఉన్నాయన్న బుక్స్ లో కూడా ముస్లిమ్స్ గురించి అనేక ఘోరమైన, అస్పష్టమైన, తప్పుడు చిత్రణలు/అపోహలు  ఉన్నాయి. షరియా అంటే తెలియని వారు లేదా ఇస్లాం మూలా సూత్రాలు గురించి తెలియని వారు వాటి గురించి వ్రాస్తున్నారు. శాంతి, సత్యాన్ని చాటే ఇస్లాం ను అనుసరించే కొన్ని బిలియన్ల విశ్వాసకుల(Muslims) గురించి సత్యాన్ని తెలిపే బుక్స్ అతి తక్కువ గా  ఉన్నాయి. నా ద్రుష్టి లో ఇస్లాం గురించి సరిఅయిన  అవగాహన, సత్యాన్ని తెలపడం  లో క్రింది 10 పుస్తకాలు సఫలం అయినాయి.

ఇస్లాం గురించి వాస్తవం తెలుసుకోవాలంటే అమెరికన్లు కానీ ఇతరులు గానీ ఉపయోగపడే 10 అత్యుతమ ఆంగ్ల బుక్స్ ఇక్కడ తెలుసుకోండి. ఇస్లాం గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే క్రింది పుస్తకాలు చదవవచ్చు.

1.నో గాడ్ బట్ గాడ్

(No God but God) :

దిని రచయిత రెజా అస్లాన్. రెజా అస్లాన్ పుస్తకం  పాత పుస్తకం కాని దీని ద్వారా ఇస్లాం యొక్క మూలాలు గురించి తెలుసుకొవచ్చు. ఇస్లాం యొక్క ఆరంభంలో ముస్లింలు ఎల్లా ఉన్నారు? వారు ఇస్లాం ప్రపంచవ్యాప్తం గా విస్తరించినప్పుడు రాజకీయంగా, సంస్కృతి, విశ్వాసపరంగా  ఎటువంటి మార్పులకు లోను అయ్యారో ఈ పుస్తకం వివరంగా తెలుపుతుంది. ఈ పుస్తకం నా అభిమాన పుస్తకం ఇందులో అస్లాన్ తన భావాలు పండితుడు గా వివరించినాడు కాని ఒక ముస్లింగా రాయలేదు.

2. దిగ్రేట్ తెఫ్ట్ 

(The Great Theft):

 దిని రచయిత ఖలేద్ అబౌ ఎల్ ఫద్ల్ (KHALID Abou El Fadl). ఇతడు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు హేతుబద్ధ ఆలోచన నుండి తీవ్రవాదులు గా మారిన విధానపు సాహిత్య వివరణలు,తీవ్రవాదం మరియు కొన్నిసార్లు హింస కు పాల్పడిన విధానం గురించి  విపులం గా తన పుస్తకం లో వివరించినాడు.  నేడు కొన్ని ముస్లిం దేశాలలో చూస్తున్న రాజకీయ తిరుగుబాట్లు  మరియు విప్లవ సిద్దాంతాలను అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం ఒక అద్భుతమైన మార్గం.

3. జేనేరేషణ్ ఎం

(Generation M) :

దీని రచయిత సెలినా జన్ మొహమేద్: ఈమె తన  పుస్తకం లో ప్రపంచవ్యాప్తం గా ముస్లిం యువత - ఆలోచన, వారి నుభూతి మరియు వారిని నేడు ప్రపంచంలో ఏకైక శక్తిగా చేస్తున్న విధానం పై ఒక సర్వే ఉంది.వారు మతపరమైన మిల్లినియల్స్ గా రుపోoదుతున్న విధానం మరియు వ్యవస్థాపకత, సాంకేతిక, ఫ్యాషన్, ఆహారము, వినిమయతత్వం, వాతావరణ మార్పు పై వారి ఆలోచనలు చిత్రీకరించారు.

4. ది స్టొరీ ఆఫ్ ఖురాన్

(The Story of the Quran)

దిని రచయిత ఇంగ్రిడ్ మట్ట్సన్.ఇది ఒక చిన్న పుస్తకం. కానీ అది ఇస్లాం యొక్క పవిత్ర పుస్తకం ఖురాన్ యొక్క మత,సాంస్కృతిక మరియు రాజకీయ ప్రాముఖ్యత ను  స్పష్టం చేస్తుంది. ఈ పుస్తకం ఒక ముస్లిం జీవితంలో దివ్య ఖురాన్ వహించే పాత్ర ఏమిటి, దానిని ఎవరు రాసినారు, అతడి పట్ల మన  భావాలు ఏమిటి? ఈ ప్రశ్నలకు విపులంగా ఒక మతవేత్త మరియు టీచర్ అయిన మట్ట్సన్ సమాధానములు చెప్తారు.

5.ముహమ్మద్ ఎ ప్రోఫెట్ అఫ్ అవర్ టైం

(Muhammad: A Prophet for Our Time) :

ఈ పుస్తక రచయిత్రి కరెన్ ఆర్మ్ స్ట్రాంగ్. ఈమె ముస్లింలందరు  గౌరవించే వ్యక్తి ప్రవక్త (స) జీవితచరిత్రను తన పుస్తకం లో వివరించారు. ఇది అందరు  తప్పక చదవ వలసిన పుస్తకం.కరెన్ ఆర్మ్స్ట్రాంగ్ ఇస్లాం గురించి అనేక పుస్తకాలు రాశారు మరియు అన్ని పఠన యోగ్యం అయినవి. ప్రవక్త(స) గురించి మనలో చాలా మంది కి  తెలియదు వారికి ఇది  ఉపయోగకరంగా ఉంటుంది. ఇది కాలం,మత విశ్వాసాలతో పని లేని చాలా అవసరమైన నిష్పాక్షికమైన, చారిత్రక గ్రంధం.

6.1001 ఇన్వెన్షన్స్ 

(1001 Inventions):

 దీని రచయిత సలీం అల్ హస్సన్ని. ఈ పుస్తకం ముస్లిం నాగరికత యొక్క వికాసాన్ని తెలుపుతుంది. ముస్లింలు ప్రపంచానికి అందించిన అవిష్కరణలను  వివరించే గ్రంధం.  ఇది ఇస్లాం విమర్శకుల దృక్పదాన్ని మార్చుతుంది.  ఇది ఒక నేషనల్ జియోగ్రాఫిక్ ప్రెజెంటేషన్ మరియు కిడ్స్ వెర్షన్ కూడా కలిగి ఉంది. ముస్లిముల రూపొందించబడి నేటికీ ఉపయోగంలో ఉన్నఅమూల్యమైన వివిధ శాస్త్రీయ మరియు సాంకేతిక ఆవిష్కరణలను చూపును.

7.సర్వెంట్స్ అఫ్ అల్లాహ్

(Servants of Allah):

 దీని రచయిత సిల్విన్ ఎ. దియోఫ్ఫ్. ఇది ఆఫ్రికా ముస్లింలను గురించి తెల్పును. ఇది అమెరికా లో ఆఫ్రికన్ బానిసలతో ఇస్లాం యొక్క రాక మరియు మతపరమైన మనుగడ కోసం వారు చేసిన పోరాటం యొక్క పరిశోధనా అంశాలను అందిస్తుంది.

8.ముస్లిమ్స్ అండ్ ది మేకింగ్ అఫ్ అమెరికా 

(Muslims and the Making of America):

ఇది అమీర్ హుస్సేన్ చే అమెరికా లోని ముస్లిమ్స్ పై విబిన్న దృక్పదం తో రాయబడిన మరొక పుస్తకం. అమెరికన్ పాపులర్ కల్చర్ లో భాగం గా సంగీతం,రాజకీయాలు, నిర్మాణం మరియు స్పోర్ట్స రంగాలలో అమెరికన్ ముస్లిమ్స్ వహించిన మరుపురాని పాత్రను వివరిస్తుంది.  ఇది ఒక చిన్న పుస్తకం కాని  అత్యంత ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది.

9.ఐ స్పీక్ ఫర్ మైసెల్ఫ్

(I Speak for Myself):

ఇది  విశ్వాస ప్రయాణంలో తమ అనుభవాలను గురించి 40 మంది అమెరికన్ ముస్లిం మహిళలు రాసిన ఒక వ్యాసాల సిరీస్.వారి మతం ఒకటే కావచ్చు, వారి వ్యక్తిగత కధనాలు, నేపథ్యాలు బిన్నంగా కలవు. వాటిని ఇస్లాం యొక్క నేపద్యంలో సుందరంగా చిత్రించారు. అమెరికన్ ముస్లిం పురుషుల గురించిన  ఒక భాగస్వామ్య  వ్యాస సేకరణ కూడా ఉంది.

10.ది ఫియర్ అఫ్ ఇస్లాం

(The Fear of Islam):

రచయిత టాడ్ హెచ్ గ్రీన్. ఈ పుస్తకం లో ఇతను  పాశ్చాత్యదేశాల్లో ప్రబలంగా ఉన్న ఇస్లామోఫోబియా యొక్క పరిచయం లేదా ముస్లింలoటే ఉన్న అకారణ భయం గురించి వివరించాడు. ఇది ఇస్లామోఫోబియా యొక్క మూలాల నుండి ప్రస్తుత సమస్యలకు వరకు ఉన్న ఒక సమగ్ర రీడర్ లేదా మీడియా సాధారణీకరణలు అర్ధం చేసుకోవటానికి  సాయపడును.

✍️ రచయిత-మహమ్మద్ అజ్గర్ అలీ

రాజనీతి తత్వ శాస్త్ర విశ్రాంత అధ్యాపకులు

సెల్ నెం-94915-01910

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: