ఎంఆర్ 9 న్యూస్ లోగో ఆవిష్కరణ
హాజరైన ప్రముఖులు
(జానోజాగో వెబ్ న్యూస్-మార్కాపురంప్రతినిధి)
ప్రకాశంజిల్లా మార్కాపురం పట్టణంలో MR9 న్యూస్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా జర్నలిస్టుల సమావేశం కూడా ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం రెవిన్యూ డివిజనల్ ఆఫీసర్ ఎం శేషి రెడ్డి, మార్కాపురం డిఎస్పి ఎం కిషోర్ కుమార్, MR9 న్యూస్ ఛానల్ అధినేత అండ్ సీఈవో శ్రీ గుండారెడ్డి మల్లికార్జున పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ డి ఓ గారు, డిఎస్పీ గార్లుMR9 న్యూస్ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి GTVఛానల్ ఎండి రమేష్ కుమార్, మరియు, SR న్యూస్ ఛానల్ MD, మరియు “ జానో-జాగో “ వెబ్ న్యూస్ గుంటూరు, ప్రకాశం జిల్లాల బ్యూరో చీఫ్ షేక్. గౌస్ బాష, జానో-జాగో వెబ్ న్యూస్ తర్లుపాడు విలేఖరి షేక్. మౌలాలి, MR9 న్యూస్ AP& తెలంగాణ కోఆర్డినేటర్లు శ్రీ పిన్ని బోయిన సుబ్బారావు,రావిపాటి విష్ణువర్ధన్, ప్రకాశం జిల్లా బ్యూరో శ్రీ పిన్ని బోయిన శ్రీ లత, ప్రజా సాక్షి బ్యూరో శ్రీ వాణి , ఇంచార్జ్ షేక్ నాగూర్ భాష, మార్కాపురం ఇన్చార్జి గార్లపాటి రెక్స్ బాబు, బెజవాడ ఎలియాజరు, కందుకూరు ఇంచార్జ్ విజయ్ కుమార్, అద్దంకి ఇన్చార్జి కొల్ల సింగయ్య గార్లు పాల్గొని సమావేశ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.
Post A Comment:
0 comments: