2021

ఎమ్మెల్యే కాటసాని చేతుల మీదగా..

శ్రీ దుర్గ భోగేశ్వర స్వామి దేవస్థానం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

(జానో జాగో వెబ్ న్యూస్ గడివేముల ప్రతినిధి)

శ్రీ దుర్గ భోగేశ్వర స్వామి దేవస్థానం 2022 నూతన సంవత్సర క్యాలెండర్ ను పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగినది. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి నివాసంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటీసీ సభ్యుడు ఆర్.బి చంద్రశేఖర్ రెడ్డి ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ ఆర్ గోపాలయ్య ,ధర్మకర్తలు చింతల వెంకటరమణ,

మధు, కో ఆప్షన్ మెంబర్ హుస్సేన్ భాష, ఆర్ బి కె చైర్మన్ పుల్లయ్య, వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ వెంకటకృష్ణారెడ్డి, నరసింహులు, దుర్వేసి కృష్ణారెడ్డి, పుల్లారెడ్డి, ఆలయ అర్చకులు శ్యామ్ సుందర్ శర్మ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి      

 ఎమ్.పి.జె ఆధ్వర్యంలో...., 

టి.ఎన్.జి.వోస్ నేత అఫ్జల్ హసన్ చే నిరుపేదలకు దుప్పట్ల  పంపిణీ 

(జానో జాగో వెబ్  న్యూస్- ఖమ్మం ప్రతినిధి)

 ఖమ్మం నగరంలోని మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (ఎమ్.పి.జె)  కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు షేక్ ఖాసిమ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా షేక్. అఫ్జల్ హసన్, టి.ఎన్.జి.వోస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు, పాల్గొని నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు . ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ ఎమ్.పి.జె చేస్తున్న సామాజిక  కార్య క్రమాలు అభినందించారు. ఈ సంస్థ చేస్తున్న వివిధ రంగాల్లో సేవలను కొనియాడుతూ, తాను ఎల్లప్పుడూ అండగా జిల్లా ఎమ్.పి.జెకు అండగా  ఉంటానని తెలిపారు. జిల్లా అధ్యక్షులు ఎస్.కే. ఖాసిమ్ మాట్లాడుతూ

రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా ఎమ్.పి.జె సంస్థ స్థాపించ బడిందని తెలిపారు. ప్రసంగించిన వారిలో షౌకత్ అలీ, నజీముద్దీన్, ముక్తార్, సాగర్, ఖాలిద్ లు ఉన్నారు.  అనంతరం జిల్లా ఎమ్.పి.జె అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు ముఖ్య అతిధి, ఉద్యోగ సంఘాల నేతగా ఎన్నిక కాబడిన అఫ్జల్ హసన్ బృందానికి అభినందనలు తెలిపి మిఠాయిలు తినిపించి, పుష్ప గుచ్ఛాలు, శాలువా లతో ఘనంగా సత్కరించారు. 

ఈ కార్యక్రమం లో అతిధులు షౌకత్ అలీ ( మాజీ కార్పొరేటర్), ముక్తార్ (సుడా డైరెక్టర్), నజీముద్దీన్ (సేవా బ్యాంకు డైరెక్టర్), ఆర్.వి.ఎస్.   సాగర్ (టి.ఎన్.జి.వోస్ కార్యదర్శి), ఎమ్.పి.జె జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్.ఏ. గఫార్, ప్రధాన కార్యదర్శి ఎమ్.డి. నాసర్, కార్యదర్శులు రజబాలి, సతీష్, రఫీఖ్, కోశాధికారి ఎమ్.డి. హకీమ్, మీడియా సెక్రటరీ చక్రి, అజీజ్, గఫార్, పాషా, అఫ్సర్, హుస్సేన్, బియాబాని, ఖాలిక్, జాని, నయీమ్, అన్వర్, ఖాదర్ తదితర ఎమ్.పి.జె నాయకులు పాల్గొన్నారు .

 కృష్ణ సాయి ఇన్ అండ్ యాజ్

"సుందరాంగుడు" వస్తున్నాడు!!

(జానో -జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)

     కృష్ణసాయి టైటిల్ పాత్రలో చంద్రకళ ఆర్ట్ క్రియేషన్స్-ఎమ్.ఎస్.కె.ప్రమీదశ్రీ ఫిలిమ్స్ పతాకాలపై ఎమ్.ఎస్.రాజు-చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న లవ్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "సుందరాంగుడు". వినయ్ బాబు దర్శకత్వం వహించిన ఈ వినూత్న ప్రేమకథాచిత్రం సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి మూడోవారంలో విడుదలకు సిద్ధమవుతోంది. మౌర్యాని, ఈషా, రీతూ, సాక్షి శర్మ ఈ చిత్రంలో హీరోయిన్లు.

      ఈ సందర్భంగా నిర్మాతలు ఎమ్.ఎస్.రాజు-చందర్ గౌడ్ మాట్లాడుతూ..."మా హీరో కృష్ణ సాయి చాలా అద్భుతంగా నటించాడు. హీరోగా తనకు ఉజ్వలమైన భవిష్యత్ ఉంది.

అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకునే చిత్రం "సుందరాంగుడు". రామోజీ ఫిల్మ్ సిటీ, గోవాలోని అత్యద్భుత లొకేషన్స్ లో చిత్రీకరించిన పాటలు "సుందరాంగుడు" చిత్రానికి ప్రధానాకర్షణ" అని అన్నారు.

      జీవా, భాషా, అమిత్ తివారి, జూనియర్ రేలంగి, మిర్చి మాధవి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఫైట్స్: రామ్ సుంకర-అశోక్ రాజ్, మ్యూజిక్: సిద్ధబాబు, కెమెరా: వెంకట్ హనుమాన్, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాతలు: ఎమ్.ఎస్.రాజు-చందర్ గౌడ్, దర్శకత్వం: వినయ్ బాబు!!

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి నూతన సంవత్సర క్యాలెండర్ విడుదల చేసిన... 

ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్

(జానో -జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం లోని గని గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ సీనియర్ నాయకులు డి.వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయులు ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం డి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై మరియు ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ఏపిటిఎఫ్ నిరంతరం కృషి చేస్తుందని, ఆయన పేర్కొన్నారు. ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్.మహబూబ్ బాషా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జీ.వి,నారాయణరెడ్డి టీచర్ల సమస్యలు పరిష్కరించండి అని ప్రభుత్వానికి ఎలుగెత్తి చాటడంతో  అతని ని సస్పెన్షన్ చేయడం ఎంత వరకు సమంజసమని, సస్పెన్షన్ చేసినంత మాత్రాన ఉద్యమాలను అణచివేయలేరని, ఇది సరైన పద్ధతి కాదని, వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న 3 4 5 తరగతుల ను విలీనం చేసే ప్రక్రియను కూడా తక్షణమే ఆపివేయాలనీ, పిఆర్సి ప్రక్రియను వేగవంతంగా అమలు చేసి 55% ఫిట్మెంట్ ను ప్రకటించి,అమలు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో గని ఉపాధ్యాయులు ఐ.సుకన్య, ఆర్.శేషుమనీ రాజు, జి. పుల్లయ్య, ఎం,లక్ష్మయ్య. వసంత్ నాయక్ , సుబ్బరాయుడు, తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి

 జర్నలిస్టులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

షేక్.ఖలీఫాతుల్లా బాషా డిమాండ్

(జానో -జాగో వెబ్ న్యూస్_ఒంగోలు ప్రతినిధి)

సమస్యలతో సతమతమవుతున్న జర్నలిస్టులను ఆదుకునే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు తీసుకురావాలని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా చైర్మైన్ షేక్.ఖలీఫాతుల్లా బాషా డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలో సోమవారం నాడు జరిగిన ఆంద్రప్రదేశ్ వార్కిగ్ జర్నలిస్టుల సమైక్య ఏపీ డబ్ల్యూజెఎస్ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంనకు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా చైర్మైన్ షేక్.ఖలీఫాతుల్లా బాషా ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ జర్నలిస్టుల పరిస్థితి చాలా  కష్టదాయకమైందని అనేక సమస్యలతో సతమతమౌతున్న పరిస్థితి లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కోరారు.ప్రపంచం మొత్తం కరోన తో  విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందేననీ కరోనాని ఎదుర్కొని నిస్వార్థంగా బాధ్యతలు నిర్వహించుతూ ఏరోజు వార్తలు ఆరోజే  పూర్తి సమాచారంతో అప్పటికప్పుడు వార్తలు  అందివ్వగలిగే జర్నలిస్టుల సమైక్య కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని కోరారు.ఈ సమావేశంలో ఏపీ డబ్ల్యూజెఎస్ జాతీయ అధ్యక్షుడు చర్లగుడ్ల రామకృష్ణ ,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల సురేష్, జిల్లా అధ్యక్షుడు కోయి శ్రీ హరి తదితరులు పాల్గొన్నారు. అనంతరం హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా చైర్మైన్ షేక్. ఖలీఫాతుల్లాబాషాని ఘనంగా సన్మానించారు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి

 గుర్తుతెలియని వాహనం ఢీ కొని ..వ్యక్తి మృతి

(జానో -జాగో వెబ్ న్యూస్_గడివేముల ప్రతినిధి)

కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండల పరిధిలోని గడిగరేవుల, తిరుపాడు, గ్రామాల మధ్య  జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే నంద్యాల లోని దేవనగర్ కాలనీకి చెందిన షేక్ గపూర్ ( 32 సం) ఉదయం సోఫీ సాహెబ్ దర్గా కు వెళ్లి సందర్శించుకొని, AP 39 JL 6154 TVS XL 100 వాహనం పై నంద్యాల కు తిరిగి వస్తుండగా సుమారు రాత్రి 07:30 నిమిషాల ప్రాంతంలో గడిగరేవుల, తిరుపాడు, రహదారి మధ్యలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో షేక్ గపూర్ ( 32 సం ) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, భార్య కలరు.

 ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి ప్రకాశం జిల్లా ప్రజలకు... ఇది చీకటి రోజు

కందుల నారాయణరెడ్డి

(జానో -జాగో వెబ్ న్యూస్_మార్కాపురం ప్రతినిధి)

 ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజలకు చీకటి రోజు అని మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల  నారాయణ రెడ్డి పేర్కొన్నారు.  సోమవారం నాడు మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పొదిలిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు ఎర్రగొండపాలెంలోని వివాహ వేడుకలకు విచ్చేసి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్న శ్రీ పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు పై అధికారులతో కనీసం రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించలేదని మరియు ఆర్ ఆర్ ప్యాకేజీ 1200 కోట్ల రూపాయలలు రిలీజ్ చేయకుండా వెలిగొండ ప్రాజెక్టు ను మూలనపడవేశారని తెలియజేశారు.

తద్వారా ప్రకాశం జిల్లా ప్రజలకు ఈ రోజు చీకటి రోజు అని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు కు నికర జలాల కొరకై తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గత ఆరు నెలల నుంచి పోరాటాలు చేస్తుంటే పోలీస్ శాఖ ద్వారా ఉద్యమాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని తెలియజేశారు. రాయలసీమకు నికర జలాలు కేటాయిస్తూ ఉన్న ముఖ్యమంత్రి వర్యులు వెలిగొండ ప్రాజెక్టు కూడా 42 టీఎంసీల నికర జలాలను కేటాయించి ప్రకాశం జిల్లా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమ ప్రజల మీద ఉన్న ప్రేమ,  వెనుకబడిన ప్రకాశం జిల్లా ప్రజల మీద లేదా అని ప్రశ్నించారు.     

                    ఇటీవల కాలంలో అకాల వర్షాలకు ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో మిరప, సెనగ, పత్తి, కంది.మినుము పంటలు     తుడిచిపెట్టుకుపోయిన ఇంతవరకు రైతులకు పంట నష్ట పరిహారం చెల్లించలేదని ఇకనైనా సదరు పంటలకు పంట నష్ట పరిహారం విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.  ఆ తరువాత సూర్య దినపత్రిక 2022 వార్షిక  క్యాలెండర్ ను విడుదల చేశారు. ఆ తరువాత మంజునాద ఫంక్షన్ హాల్ లో పెన్ పవర్ 2022 వార్షిక  క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

✍️ రిపోర్టింగ్-షేక్ గౌస్ బాషా

జానో - జాగో వెబ్ న్యూస్-బ్యూరో చీఫ్

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి

 మాంచి కిక్కిచ్చే క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ"

"రెక్కీ" ఫస్ట్ లుక్ విడుదల 

వేడుకలో చిత్ర బృందం!!

(జానో జాగో వెబ్  న్యూస్-సినిమా బ్యూరో)

     "స్నోబాల్ పిక్చర్స్" పతాకంపై ప్రొడక్షన్ నంబర్-1గా తెరకెక్కుతున్న సూపర్ క్రైమ్ థ్రిల్లర్ "రెక్కీ". "కొన్ని క్రైమ్ కథలు ఊహకు అందవు" అనే ట్యాగ్ లైన్ తో శ్రీమతి సాకా ఆదిలక్ష్మి సమర్పణ... ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ దర్శకత్వంలో కమలకృష్ణ నిర్మిస్తున్న ఈ యునీక్ ఎంటర్టైనర్ తో అభిరామ్ హీరోగా పరిచయమవుతుండగా... క్రేజీ కమెడియన్ భద్రమ్ సెకండ్ హీరోగా... ఇప్పటివరకు తన కెరీర్ లోనే చేయని ఓ వినూత్నమైన పాత్ర పోషిస్తున్నారు. అమీక్షా పవార్, జస్విక హీరోయిన్లు. 

     ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఎంతో ఆహ్లాదకరంగా జరిగిన వేడుకలో యూనిట్ సభ్యులు ఆవిష్కరించుకున్నారు. చిత్ర కథానాయకుడు అభిరామ్, దర్శకుడు ఎన్. ఎస్.ఆర్.ప్రసాద్, నాయకి సమీక్ష, సెకండ్ హీరో భద్రమ్, ఈ చిత్రంలో ఓ ముఖపాత్ర పోషించిన భాష, ఎడిటర్ పాపారావు ఈ వేడుకలో పాల్గొన్నారు.

    క్రైమ్ థ్రిల్లర్స్ జోనర్ లో తెలుగు తెరపై ఇప్పటివరకు రాని కథాoశంతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో అత్యంత ఆసక్తికరంగా రూపొందుతున్న "రెక్కీ" టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్టర్ అవుతుందని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి చేసుకుని, తుది మెరుగులు దిద్దుకుంటున్న "రెక్కీ" చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఈ చిత్ర రూపకల్పనలో ప్రముఖ నిర్మాత జెమిని కిరణ్ గారు అందించిన మోరల్ సపోర్ట్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు.

      నాగరాజు ఉండ్రమట్ట, దేవిచరణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, పబ్లిసిటీ డిజైనర్: శక్తి స్వరూప్, ఆర్ట్: రాజు, కెమెరా: వెంకట్ గంగాధరి, ఎడిటర్: కె.ఎల్.వై.పాపారావు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: ఎస్.చిన్నా, ప్రొడక్షన్ మేనేజర్: నాగార్జున, సమర్పణ: శ్రీమతి సాకా ఆదిలక్ష్మి, నిర్మాత: కమలకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్!!

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి      

 సీన్ రివర్స్...ఆనందయ్య నీ మందు వద్దయ్య

(జానో జాగో వెబ్  న్యూస్-ఏపీ ప్రతినిధి)

కరోనా సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కరోనా మందు ఆనందయ్యకు చెదు అనుభవం ఎదురైంది.  ఒకపుడు ఆనందయ్యకు ఎనలేని క్రేజ్ ఉండేది. కానీ ఇపుడు సీన్ రివర్స్ అవుతోంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్యకు స్థానికుల నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. ఆయన ఇంటి ముందు జనాలు ధర్నాకు దిగారు.. మందు పంపిణీ చేయొద్దని ఆందోళన చేపట్టారు. మందు పంపిణీ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇతర రాష్ట్రాల నంచి వేలమంది ఇక్కడికి రావడం వల్ల తమకు కరోనా సొకుతుందని గ్రామస్తులు అంటున్నారు. ఒమిక్రాన్‌కు మందు కనిపెట్టినట్లు అసత్యం ప్రచారం చేస్తున్నారని ఆనందయ్యపై మండిపడ్డారు. ఆనందయ్య ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలా పంపిణీ చేస్తారంటూ కొందరు నిలదీశారు. అయితే ఆనందయ్య వాదన మరోలా ఉంది.. మందు పంపిణీకి అనుమతి ఉందని. మందు కోసం చాలామంది వస్తున్నారని. కావాలనే కొందరు ఆందోళన చేస్తున్నారని ఆరోపించారు. స్థానికులు ధర్నా చేస్తున్న విషయం తెలియడంతో పాటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆనందయ్యతో చర్చించారు.. పర్మిషన్ లెటర్ చూపించాలని కోరారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి      

 కాంగ్రెస్ నేతల గృహనిర్బంధం-

ఆగ్రహించిన మల్లు భట్టి విక్రమార్క

(జానో జాగో వెబ్  న్యూస్-తెలంగాణ బ్యూరో)

సీఎం దత్తత గ్రామం ఎర్రవెల్లి లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించే రచ్చబండ కార్యక్రమానికి వెళ్లకుండా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు లతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులతో గృహనిర్బంధం చేశారు. టీఆర్ఎస్ సర్కారు చర్యను తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కతీవ్రంగా ఖండించారు. దేశంలో స్వేచ్ఛా స్వాతంత్రం కల్పించిన రాజ్యాంగానికి విరుద్ధంగా టిఆర్ఎస్ ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ప్రతి పక్షాలు, ప్రజా సంఘాలు ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేయకుండ అడ్డు కోవడం, పోలీసులతో నిర్బంధం ప్రయోగించడం గత ఎనిమిది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పాలకులు అనుసరిస్తున్న పద్ధతి సరైంది కాదన్నారు. టిఆర్ఎస్ నియంతృత్వ, నిరంకుశ పరిపాలనపై ఇక తెలంగాణ ప్రజలు ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. పోలీసులతో నిర్బంధం ప్రయోగించి భావవ్యక్తీకరణ ఆపాలనుకోవడం సర్కార్ పెద్ద పొరపాటు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర పోలీసులు హౌస్ అరెస్టు చేస్తే వరి ధాన్యం కొనుగోలు పై సీఎం కేసీఆర్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసేవారా అని ప్రశ్నించారు. ధర్నాల విషయంలో టీఆర్ఎస్ పార్టీకి ఒక న్యాయం? ప్రతిపక్షాలకు మరో న్యాయమా? ప్రజాస్వామ్య పాలనలో ఇదేం పద్దతి అని టిఆర్ఎస్ సర్కార్ ను నిలదీశారు. రచ్చబండ కు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు టిఆర్ఎస్ ధర్నాలను ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ధర్నాలు చేస్తే పోలీసుల చేత అరెస్టు చేయించాడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు రైతులు వరి వేయొద్దు అని ఏ రాష్ట్ర సర్కార్ చెప్పలేదన్నారు. మొట్ట మొదటిసారిగా తెలంగాణ సర్కార్ చేతగానితనంతో వరి వేస్తే ఉరి అని ప్రకటించడం సిగ్గుచేటని అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి రావాలని, ఆహార ఉత్పత్తి పెంచాలని, ఆహారధాన్యాల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని అన్నారు. కానీ, ఆ బాధ్యతను విస్మరించి రాష్ట్రంలో వరి పండించొద్దని ప్రభుత్వం పోలీసులు, అధికారులతో రైతుల పై ఒత్తిడి చేయించడం దుర్మార్గమని ధ్వజ మెత్తారు.  గత ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన నీటి వనరులతో రైతులు వరి పంటలు పండిస్తారని,. యాసంగి లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం ఎలా కొనుగోలు చేయవో చూస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని. అన్నదాతలు అధైర్యపడొద్దని. ధాన్యం కొనుగోలు చేయకుంటే బీజేపీ టీఆర్ఎస్ సర్కార్ లపై కాంగ్రెస్ పార్టీ యుద్ధం చేస్తుందని ప్రకటించారు.

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, 

,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

ఫిరోజ్ గాంధీ నిజంగా ముస్లిమా...కాంగ్రెస్ ముస్లిం అనుకూల విధానాల పార్టీయా...?

ఫిరోజ్ గాంధీ ముస్లిం అయితే ఆయన్ని పార్శి మత ఆచారాల ప్రకారం ఎందుకు అంత:క్రియలు చేసినట్లు....వాస్తవం ఏమిటో తెలుసుకోవాలని ఉందా...అయితే త్వరలోనే ఈ వాస్తవిక కథ ఇపుడు మీ జానో జాగో టీవీలో వచ్చేసింది. ఇందుకోసం...jaanojaagotv నీ Subscribe చేసుకోండి

రాజకీయ..సామాజిక..సినిమా...రంగం ఏదైనా విశ్లేషణాత్మక కథనాలు కోసం jaanojaago tv నీ Subscribe చేసుకోండి      

 తవ్వేకొద్ది వెలుగులోకి...

రూ.257 కోట్లకుపైగా నగదు, కిలోల కొద్దీ బంగారం స్వాధీనం

విస్తుపోయిన  అధికార్లు

(జానో జాగో వెబ్  న్యూస్-నెట్ వర్క్ డెస్క్)

సుధీర్ఘ  తనిఖీల అనంతరం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ ప్రదేశ్‌ సుగంధ ద్రవ్యాల వ్యాపారి, సమాజ్‌వాదీ పార్టీ నేత పీయూష్‌ జైన్‌ నివాసంలోనుంచి రూ.257 కోట్లకుపైగా నగదు, కిలోల కొద్దీ బంగారం స్వాధీనం చేసుకొన్నారు. ఇది ఎక్కడ అని అనుకొంటున్నారా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ ప్రదేశ్‌ సుగంధ ద్రవ్యాల వ్యాపారి, సమాజ్‌వాదీ పార్టీ నేత పీయూష్‌ జైన్‌ నివాసంలోనే. గత  గురువారం ఉదయం మొదలైన తనిఖీలు. ఆదివారం వరకు సాగాయి. దాదాపు 50 గంటల పాటు పీయూష్‌ జైన్‌ను విచారించిన అనంతరం ఆదివారం సాయంత్రం అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. పీయూష్‌ జైన్‌ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో గత వారం జీఎస్‌టీ, ఐటీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పీయూష్‌ ఇంట్లోని రెండు బీరువాల్లో గుట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి అధికారులు అవాక్కయ్యారు. ఆ మొత్తాన్ని లెక్కించడానికి దాదాపు నాలుగు రోజుల సమయం పట్టింది. మొత్తంగా రూ.257కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్ ప్రదేశ్‌ సుగంధ ద్రవ్యాల వ్యాపారి, సమాజ్‌వాదీ పార్టీ నేత పీయూష్‌ జైన్‌ నివాసంలో జీఎస్‌టీ, ఐటీ దాడులకు సంబంధించి అధికారులు కీలక విషయాలను వెల్లడించారు. దాదాపు 120 గంటల పాటు కొనసాగిన ఈ సోదాల్లో రూ.257 కోట్లకుపైగా నగదు, కిలోల కొద్దీ బంగారం, ఖరీదైన ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పీయూష్‌ జైన్‌ భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడినట్టు గుర్తించిన అధికారులు.. ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పీయూష్‌ జైన్‌ పన్ను ఎగవేతకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో గత వారం జీఎస్‌టీ, ఐటీ అధికారులు సోదాలు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పీయూష్‌ ఇంట్లోని రెండు బీరువాల్లో గుట్టలుగా బయటపడ్డ నోట్లను చూసి అధికారులు అవాక్కయ్యారు. ఆ మొత్తాన్ని లెక్కించడానికి దాదాపు నాలుగు రోజుల సమయం పట్టింది. మొత్తంగా రూ.257కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ ఇన్వాయిస్‌లు, ఈ-వే బిల్లుల ద్వారా పన్ను ఎగవేతతో మొత్తంగా రూ. 1000కోట్ల వరకు కూడబెట్టినట్టు భావిస్తున్నారు. పీయూష్‌ ఇంట్లో నోట్ల కట్టల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఇదిలావుంటే నగదుతో పాటు వివిధ ప్రాంతాల్లో 16 విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాన్పుర్‌లో 4, కన్నౌజ్‌లో 7, ముంబయిలో 2, ఢిల్లీలో ఒకటి ఉన్నట్టు గుర్తించగా.. దుబాయ్‌లో మరో రెండు ఆస్తులున్నట్లు తేలింది. ఆదివారం నాటి సోదాల్లో మరో రూ.10 కోట్లు నగదు బయటపడింది. కన్నౌజ్‌లోని పీయూష్‌ జైన్‌ పూర్వీకుల నివాసంలో 18 లాకర్లను గుర్తించిన అధికారులకు.. వీటికి సంబంధించి మరో 500 తాళాలు కూడా లభించినట్టు సమాచారం. ఆ లాకర్లను తెరవడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు.