యంగ్ హీరో సందీప్ కిష‌న్ రిలీజ్ చేసిన....

ఇమంది శ్రీను `H 23` మూవీ ట్రైల‌ర్‌

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

వి. కుమారస్వామి, కవిత, శ్రీజ హీరోహీరోయిన్లుగా ఇమంది శ్రీను (బీటెక్ బాబులు)ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హార‌ర్ కామెడి చిత్రం `H23`. మాస్ట‌ర్ జోషిత్ స‌మ‌ర్ప‌ణ‌లో వైవీకేఎస్ క్రియేషన్స్ పతాకంపై న‌వీన కె, సంధ్య వి వై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తరుణ్ రాణా ప్రతాప్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ ఆవిష్క‌రించారు. ప్ర‌ముఖ నిర్మాత యమ్ వి వి సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేసి `H23` చిత్ర యూనిట్‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. కాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను వైజాగ్ నోవాటెల్ హోట‌ల్‌లో యంగ్ హీరో సందీప్ కిష‌న్ రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ తెలిపారు``ఈ సంద‌ర్భంగా..

ద‌ర్శ‌కుడు ఇమంది శ్రీను మాట్లాడుతూ - `` మా `H23` మూవీ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసిన కోన వెంక‌ట్‌గారికి, ట్రైల‌ర్ విడుద‌ల చేసిన సందీప్ కిష‌న్ గారికి, అలాగే యమ్ వి వి సత్యనారాయణ గారికి హృద‌య‌పూర్వ‌క ద‌న్య‌వాదాలు. `ప‌గ‌బ‌‌ట్టే ఆత్మ‌కంటే... ప్రేమించే ప్రేతాత్మ ప్ర‌మాద‌క‌రం` అనే ఒక డిఫ‌రెంట్ క‌థాంశంతో హార‌ర్ కామెడిగా ఈ మూవీ రూపొందుతోంది. ఆర్టిస్టులు టెక్నీషియ‌న్స్ కొత్త‌వారైనా పూర్తి స‌హ‌కారం అందించారు. ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తుంది`` అన్నారు.

నిర్మాత‌లు న‌వీన కె, సంధ్య వి వై  మాట్లాడుతూ - ``మా బేన‌ర్‌లో రూపొందుతోన్న`H23` మూవీ  చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి జ‌న‌వ‌రిలో థియేట‌ర్‌ల‌లో విడుద‌ల చేస్తాం`` అన్నారు. 

ఈ చిత్రంలోని పాట‌లు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుద‌ల‌వుతున్నాయి.

వి. కుమారస్వామి, కవిత, శ్రీజ, సాయి కుమార్, రాజేశ్వ‌రి, క్రాంతి, హ‌రీష్‌, విజ‌య్‌, కేశ‌వ‌, సంతోష్ కుమార్ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి

సినిమాటోగ్ర‌ఫి: స‌ందీప్ బ‌డ్డుల‌,

సంగీతం: తరుణ్ రాణా ప్రతాప్, 

స‌మ‌ర్ప‌ణ‌:  మాస్ట‌ర్ జోషిత్‌,

నిర్మాత‌లు: న‌వీన కె, సంధ్య వి వై,

ద‌ర్శ‌క‌త్వం: ఇమంది శ్రీను (బీటెక్ బాబులు). 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: