ముందు వరుసలో, ఉచితంగా ఇవ్వాలి 

మంత్రి పువ్వాడ కు టీయూడబ్ల్యుజే(ఐజేయూ) వినతి 

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ముందు ఉండి పోరాడిన వారిలో  వైద్య, ఆరోగ్య, పారిశుద్ధ్య సిబ్బంది,  పోలీసులతోపాటు జర్నలిస్టులు కూడా  ఉన్నారు. విధి నిర్వహణలో భాగంగా బయటి ప్రపంచంలో తిరిగి కరోనా బారినపడిన జర్నలిస్టులు అనేక మంది ఉన్నారు, కొంతమంది జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కనుక జర్నలిస్టుల ను కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి త్వరలో ప్రభుత్వం పంపిణీ చేసే కరోనా వ్యాక్సిన్ ను జర్నలిస్టులకు, వారి కుటుంబసభ్యులకు ముందు వరుసలో ఉచితంగా అందించాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు టీయూడబ్ల్యుజే, ఐజేయూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  వినతిపత్రం అందజేశారు.  కరోనా బారినపడి మృతి చెందిన  జర్నలిస్టుల కుటుంబాలను ప్రభుత్వం ఆర్ధికంగా  అందుకోవాలని కోరారు.   అపరిష్కృతంగా ఉన్న జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారించాలని విజ్ఞప్తి చేశారు ప్రధానంగా ఇంటి స్థలాలు ఇవ్వాలని,  జర్నలిస్టుల హెల్త్ కార్డులు పని చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల విషయంలో పలు సందర్భాల్లో మంత్రి  పువ్వాడ అజయ్ కుమార్  స్పందించిన తీరు అభినందనీయం అని అదేవిధంగా ఇతర  సమస్యల పరిష్కారానికి కోసం కృషి చేయాలని మంత్రి ని యూనియన్ నాయకులు కోరారు.  మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రామనారాయణ, జిల్లా అధ్యక్షులు నర్వనేని వెంకట్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు మాటేటి వేణుగోపాల్, వనం వెంకటేశ్వర్లు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు గోగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, యూనియన్ జిల్లా నాయకులు ఆవుల శ్రీనివాసరావు,  ఎగినాటి మాధవరావు,  మైసా పాపారావు,  ఉషోదయం శ్రీనివాస్ తదితరులన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: