ఇళ్ల పట్టాల పంపిణీ సర్వం సిద్ధం

నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి

సబ్ కలెక్టర్ కల్పనా కుమారి

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల డివిజన్ లో ఇళ్ల పట్టాల పంపిణీకి సర్వ సిద్ధంగా ఉన్నాయని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి అన్నారు. గురువారం నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇల్లు పథకం నంద్యాల రెవెన్యూ డివిజన్లో శుక్రవారం పండగ వాతావరణంలో నిర్వహిస్తున్నామని, నవరత్నాలులో భాగంగా అర్హులైన పేదలందరికీ ఇల్లు పొందేలా మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. 25న నంద్యాల డివిజన్లోని అన్ని మండలాలలోనూ అన్ని నియోజకవర్గాల్లోనూ బృహత్తర, రంగ రంగ వైభవంగా పట్టాల పంపిణీ నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. మన నంద్యాల డివిజన్లో 314 లేఅవుట్లలో 37, 110 మంది లబ్ధిదారులు ఇంటి పట్టాలు పొందనున్నారని, నంద్యాల అర్బన్లో టిడ్కో ద్వారా నిర్మించిన 8572 గృహాలను, ఆళ్లగడ్డ అర్బన్లో నిర్మించిన 1139 గృహాలను లబ్ధిదారులకు స్వాధీనం చేయనున్నామన్నారు. ఆర్లగడ్డ మండలంలో 20 లేఅవుట్లలో 1403 ప్లాట్లు,బనగానపల్లె మండలంలో 26 లేఔట్లకు గాను 4134 ఫ్లాట్స్, బండిఆత్మకూరు మండలంలో 25 లే ఔట్లకు గాను 1521 ప్లాట్స్,  చాగలమర్రి మండలంలో 25 లేఔట్లకు గాను 2498 ప్లాట్లు,  దొర్నిపాడు 15లేఔట్లకు గాను 746 ప్లాట్లు, గడివేముల మండలంలో 12 లేఔట్లకు గాను 1797 ప్లాట్లు,  గోస్పాడు మండలంలో 16 లేఔట్లకు  గానూ 965 ఫ్లాట్స్, కోవెలకుంట్ల మండలంలో 17 లేఔట్లకు గాను 2333 ఫ్లాట్స్, కొలిమిగుండ్ల మండలంలో 15 లేఔట్స్ గాను 1995 ఫ్లాట్స్, మహానంది మండలంలో 12 layouts గాను 1127 ఫ్లాట్స్, నంద్యాల మండలం లో 17 లేఔట్ గాను 2394, అవుకు మండలంలో 15 లేఔట్లకు గానూ  984 ఫ్లాట్స్, పాణ్యం మండలంలో 15 లేఔట్లకు గాను1946 ఫ్లాట్స్,  రుద్రవరం మండలంలో 26లేఔట్లకు గాను1095 ఫ్లాట్స్, సిరివెళ్ల మండలంలో 23 లేఔట్లకు గాను 2119 ఫ్లాట్లు, ఉయ్యాలవాడ మండలంలో 11లేఔట్లకు గాను  558 ఫ్లాట్లను శుక్రవారం 25వ తారీకు లబ్ధిదారులకు పంపిణీ గావించనున్నామని ఆమె అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: