అక్రమాలు, లంచందారులపై చర్యలు తీసుకోవాలి

రాయలసీమ యూత్ యూనియన్ (ఆర్ వై యూ) రాష్ట్ర అధ్యక్షులు రామినేని రాజునాయుడు

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

ఆర్టీఓ కార్యాలయం సాక్షిగా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి ఆ ముగ్గురు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, ముడుపులు చెల్లించుకోలేక లభోదిబోమంటున్న వాహనదారులు, వాహన యజమానులు అని, సాయంత్రం అయ్యేసరికి ఎవరెవరి అకౌంట్లలో ఎంత సొమ్ముముడుతుందో అని, లేకపోతే ప్రజలతో కలిసి ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రాయలసీమ యూత్ యూనియన్ (ఆర్ వై యూ) రాష్ట్ర అధ్యక్షులు రామినేని రాజునాయుడు హెచ్చరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నంద్యాల ఆర్టీఓ కార్యాలయంలో వాహనాలకు సంబంధించి, ఫిట్నెస్,  ఇన్సూరెన్స్ పలు రకాల సమష్యలపై, రెన్యూవల్స్ కోసం వెళుతున్న వాహనదారులకు ఎక్కడా లేని విధంగా కొంత మంది అధికారులు చుక్కలు చూపిస్తూ, చెయ్యి తడవందే పనికాదనేలా ఉందని, రకరకాల సాకులు చెప్పి వాహన యజమానులకు పట్ట పగలే చుక్కలు చూపిస్తున్నారనీ రాయలసీమ యూత్ యూనియన్ ( ఆర్.వై.యు ) రాష్ట్ర అధ్యక్షులు రామినేని రాజునాయుడు, ఏపీ విద్యార్ధి జేఏసీ జిల్లా అధ్యక్షులు వేణు మాధవ రెడ్డిలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం వారు నంద్యాలలోని స్ధానిక ఆర్.వై.యు కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ
నంద్యాల ఆర్టీఓ కార్యాలయం తరుచూ వార్తల్లో నిలుస్తుందనీ , ఏ పని జరగాలన్నా ముడుపులు చెల్లించుకోకతప్పదన్నారు. ఆర్టీఓ కార్యాలయంలో ఆ ముగ్గురు అధికారులు ఈ తంతుకు ఆజ్యం పోస్తున్నారన్నారని, ఓ అధికారి మూడు సంవత్సరాల క్రిందట నంద్యాలకు వచ్చినప్పటి నుండి ప్రజలు మరింత బెంబేలెత్తిపోయారనీ, లంచం లేనిదే నంద్యాల ఆర్టీఓ కార్యాలయంలో పనులు సాగవని వాహన యజమానులు లభోదిబో మంటున్నారనీ , తక్షణమే ఈ సమష్యపై అధికారులు స్పందించి,  లంచాలదారులపై శాఖాపరమైన చర్యలు తీసుకొని, ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రక్షాళన చేసి, ప్రజలను ఈ సమష్య నుండి ఊరట కలిగించాలని వారు కోరారు. లేని పక్షంలో ఆర్టీఓ కార్యాలయాన్ని ప్రజలతో కలిసి ముట్టడిస్తామన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: