భూములు తీసుకొంటే సహించం
కాంగ్రెస్ నేత దాసరి చింతలయ్య
(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)
ఆర్ఏఆర్ఎస్ భూములను దోచుకుంటే సహించమని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ నంద్యాల పట్టణ అధ్యక్షులు దాసరి చింతలయ్య హెచ్చరించారు. ఆర్ఏఆర్ఎస్ భూములను మెడికల్ కాలేజీ కోసం తీసుకోవద్దని చేపడుతున్న రీలే దీక్షా శిభిరాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. గత114 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆర్ ఏ ఆర్ ఎస్ భూములను వైద్య కళాశాలకు కేటాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రభుత్వ స్థలాల్లోనే వైద్య కళాశాలను నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. జిల్లాలోని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ,కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి ,ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డిలు స్పందించి ఆర్ ఏ ఆర్ ఎస్ భూముల్లో వైద్య కళాశాల నిర్మించేందుకు విడుదల చేసిన జీవో341ని వెంటనే రద్దయ్యేలా కృషి చేయాలని అన్నారు. దేశంలోనే రాష్ట్రానికి సరికొత్త వంగడాలను సృష్టించి పేరు, ప్రతిష్టలు సంపాదించి పెట్టిన ఈ భూములను రైతులు, కార్మికులు, ఉద్యోగులు, శాస్త్రవేత్తలు క్షమించరని, ఇప్పటికైనా ప్రభుత్వం స్వార్థపూరిత విధానాలను పక్కన పెట్టి పిపిపి విధానంలో ప్రవేశపెట్టే వైద్య కళాశాలను ఈభూముల్లో నిర్మించవద్దని, వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు యువకులతో కలుపుకొని భారీ ఎత్తున ఆందోళన సిద్ధమవుతమని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫరూక్. ఆర్టీసీ ప్రసాద్. రహిమాన్. సీనియర్ నాయకులు అహ్మద్. చందు పాల్గొన్నారు
Post A Comment:
0 comments: