నంద్యాల్ లో భారత్ బంద్ విజయవంతం
రైతు వ్యతిరేక చట్టాలు ప్రజాస్వామిక వ్యవస్థకు గొడ్డలి పెట్టు
కాంగ్రెస్ నేతలు షేక్ అబ్దుల్లా, దాసరి చింతలయ్య
(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)
ఇటీవల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంటులో మూజువాణి ఓటుతో అప్రజాస్వామికంగా తెచ్చిన కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం. వ్యవసాయ మార్కెట్ చట్టం. అత్యవసర సరుకుల చట్టం . రైతులకు వినియోగదారులకు వ్యతిరేకం ఆదాని అంబానీ లాంటి బడా వ్యాపారులకు అనుకూలం అని ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ కమిటీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్లా, దాసరి చింతయ్య టౌన్ అధ్యక్షులు డిమాండ్ చేశారు. మంగళవారంనాడు నంద్యాలలో భారత్ బంద్ కార్యక్రమంలో రైతు సంఘాలు సిపిఐ సిపిఎం ఐ యు ఎంఎల్ మిగతా వామపక్షాలను కలుపుకొని పాల్గొనడం జరిగింది వారు మాట్లాడుతూ ఈ చట్టాలు రైతులకు హాని చేసే విధంగా ఉన్నాయి ఈ చట్టాల వల్ల రాబోయే రోజుల్లో రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఉండదని మార్కెట్ యార్డులో ఉండవని రైతులు ఆదాని అంబానీ లాంటి బడా వ్యాపారులకు కట్టుబానిసలు అవుతున్నారు. ఈ చట్టాల ద్వారా రైతులకు ఆదాయ భద్రత వినియోగదారులకు ఆహారభద్రత ఉండదన్నారు. రాజ్యాంగంలోని వ్యవసాయ మార్కెటింగ్ రాష్ర్టాల జాబితాలోనే అంశాలను ఈ చట్టాలు సమాఖ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టు అని ధ్వజమెత్తారు బిజెపి మిత్రపక్షమైన అఖిల్ దళ్ పార్టీ ఈ చట్టాలను వ్యతిరేకించి ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి శ్రీమతి హర్ సిమ్రత్ కౌర్ రాజీనామా చేశారు ఈ రెండు పార్టీలకు రాష్ట్ర రైతు ప్రయోజనాల కంటే స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమని విరుచుకుపడ్డారు.బీజేపీ. వైకాపా. టిడిపి .రైతు దుష్మన్ పార్టీలన్నారు.రాష్ట్రంలో కుస్తీ ఢిల్లీలో దోస్తీ ఈ పార్టీల ద్వంద్వ నీతి అన్నారు.ఎముకలు కొరికే చలిని జల ఫిరంగులు బాష్ప వాయువును బారికేట్లు పోలీసుల లాఠీలను లెక్కచెయ్యకుండా దేశ రాజధాని ఢిల్లీలో గత పన్నెండు రోజులుగా ధర్నాలు చేస్తున్న రైతులు మరోస్వాతంత్య్ర ఉద్యమాన్ని తలపిస్తున్నాయి .రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను విద్యుత్ సంస్కరణల బిల్లులను ఉపసంహరించుకోవాలని కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ రెహమాన్ ట్రెజరీ టీజర్ ప్రసాద్ సీనియర్ నాయకులు అహ్మద్ హుసేన్, ఎస్ యమ్ డి ఫారుక్, శేఖర్ మనోజ్ పాల్గొనడం జరిగింది. అధికార ప్రతినిధి ఉకొట్టు వాసు మాట్లాడుతూ ఈ భారత్ బంద్ కు సహకరించిన నంద్యాల ప్రజలకు వ్యాపారస్తులకు బ్యాంకులకు తదితర అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
Post A Comment:
0 comments: