శిలా ఫలకాన్ని ద్వంసం చేయడం అనాగరికం
వైసీపీ రాష్ట్ర నేత డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్న రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ సురేష్ శిలా ఫలకాన్ని మల్లపాలెం తాండలో ద్వంసం చేయడం అనాగరికమని, ఈ సంఘటనను తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. శిలా ఫలకాలను తాత్కాలికంగా కూల్చవచ్చోమో గాని, ప్రజల హృదయాల్లో వైసీపీ చిరస్మరణీయంగా నిలచిపోతుందని అన్నారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం గాకుండా చర్యలు తీసుకోవాలని కూడా రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి పోలీసులను కోరారు.
Post A Comment:
0 comments: