అండగా ఉంటాం...

బిల్డర్ సుబ్రమణ్యంకు ముస్లిం ప్రజా సంఘాల మద్దతు

దాడి చేసిన నిందితులను కఠిన శిక్షించాలి

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

బిల్డర్ సుబ్రమణ్యంపై దాడిచేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని ముస్లిం ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.

 నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ ఎదురుగా గుర్తుతెలియని వ్యక్తులు బిల్డర్ సుబ్రమణ్యం ను కొట్టడంతో గాయాలపాలైన సత్యాన్ని తన ఇంట్లో  లౌకిక పరిరక్షణ వేదిక రాష్ట్ర  కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్, ఆవాజ్ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి, జానోజాగో(ముస్లింల అభివృద్ది వేదిక) సంఘం జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ బాషా, ఐయూఎంఎల్ జిల్లా కార్యదర్శి సలాం మౌలానా, పిడిఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి రఫీ,   పరామర్శించారు. దాడి చేసిన వాళ్లను తక్షణమే అరెస్టు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆయనకు అండగా నిలబడతామని తెలిపారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: