రాష్ట్ర వైసీపీ నేత డాక్టర్ ఏలూరి

ఆధ్వర్యంలో ఘనంగా సీఎం జగన్ జన్మదిన వేడుకలు

పలు సేవా కార్యక్రమాలు

అభిమానుల కేరింతల మధ్య...కేక్ కట్ చేసి  స్వీట్స్ పంపిణీ

వై.ఎస్.కు పూల మాలతో ఘన నివాళి

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

పేదల పెన్నిధి, రాష్ట్ర ప్రజల ఆశాజ్యోతి,రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో కూకట్పల్లిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ముందుగా ఏలూరి స్వర్గీయ డాక్టర్ వైస్ విగ్రహనికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అభిమానుల కేరింతలు సమక్షంలో కేక్ కట్ చేసి అందరికీ స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఏలూరి మాట్లాడుతూ

 


ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఈ నెల 21 వ తేది అయినప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఒకరోజు ముందుగానే స్వచ్ఛందంగా పార్టీలకు,వర్గాలకు రహితంగా జరుపుకోవడం హర్షణీయమని అన్నారు. జగన్ అభిమానులు నేడు,రేపు పెద్ద ఎత్తున రక్త దాన శిబిరాలు, పేదలకు అనేక రకాలుగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాలలొనే గాకుండా జాతీయంగా, అంతర్జాతీయంగా తెలుగు ప్రజలున్న ప్రతిచోటా జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుతుండడం పట్ల ఆయన పై ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో స్పష్టంగా కనిపిస్తుందని రాష్ట్ర వైసీపీ నాయకులు డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: