జర్నలిస్ట్ మారుతి ప్రసాద్ మరణం తీరని లోటు

విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతి రావు 

సీనియర్ జర్నలిస్ట్ మారుతి ప్రసాద్

(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)

సీనియర్ జర్నలిస్ట్ మారుతి ప్రసాద్ మరణం తీరని లోటు అని విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతి రావు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేవారు. మారుతి ప్రసాద్ లాంటి అత్యంత సన్నిహితుడిని కోల్పోవడం బాధాకరమని ఆయన వెల్లడించారు. మారుతి ప్రసాద్ కుటుంభానికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతి రావు
ఇదిలావుంటే సీనియర్ జర్నలిస్ట్ మారుతి ప్రసాద్ (62) ఆదివారం రాత్రి అకాల మరణం చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మూడు దశాబ్దాలుగా జర్నలిజంలో ఉన్న మారుతీ ప్రసాద్ సుదీర్ఘ కాలం గుంటూరు ఆపై హైదరాబాద్ లో పని చేశారు. తొలుత ఈనాడు, ఆపై ఉదయం, వార్త దినపత్రిక లో పనిచేసి ప్రస్తుతం ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ గా పని చేస్తున్నారు. 

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: