ముస్లిం ల పై జరుగుతున్న దాడులకు ప్రభుత్వం బాధ్యత వహించాలి

ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు యస్ యమ్ డి  యూనుస్

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

 ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగా అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు చూస్తున్నాయని ముస్లిం మైనారిటీలపై దాడులు జరిగితే ప్రభుత్వం గానీ అధికార పార్టీ నాయకులు కానీ పట్టించుకోవడంలేదని అధికార పార్టీ నాయకులు ముస్లింలపై దాడులు చేస్తుంటే  వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకోలేదని ముస్లిం మైనారిటీల్లో పై జరుగుతున్న దాడులను అన్ని  మతాలకు అతీతంగా అందరు కూడా ముక్తకంఠంతో ఖండించాలని ముస్లిం హక్కుల పోరాట సమితి నాయకులు పిలుపునిచ్చారు అలాగే మన భారతదేశంలో బడుగు బలహీనవర్గాల కోసం ఎలాగైతే యస్టి. యస్సి చట్టాలు చేశారో అలాగే  మైనార్టీల కోసం ఇటువంటి చట్టాలు  మన రాష్ట్రంలో అమలు అమలు పరచాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి   ముస్లిం హక్కుల పోరాట సమితి  కోరడం జరుగుతుంది. గత ఎలక్షన్లలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ముస్లిం మైనార్టీలకు చాలా హామీలు ఇచ్చారని మనం చూసుకుంటే ఇప్పటివరకు దాడులు తప్ప ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి ముస్లింలకు లేదని ముస్లింలకు ఇచ్చిన హామీలు త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటూ జిల్లా నాయకులు యూనుస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దేవ నగర్ వసీం న్యామత్ ఖాన్  హనీఫ్. సలాం. నందమూరి నగర్ నూర్ భాష. మహమ్మద్ కైఫ్ తదితరులు పాల్గొనడం జరిగింది

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: