ఆచార్య' సెట్‌లో...

చిరంజీవిని క‌లిసిన మోహ‌న్‌బాబు

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

మెగాస్టార్ చిరంజీవిని క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు క‌లుసుకున్నారు. ఆ ఇద్ద‌రూ చిర‌కాల మిత్రుల‌నే విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి 'ఆచార్య' సినిమా చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో ఆ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. బుధ‌వారం మోహ‌న్‌బాబు 'ఆచార్య' సెట్స్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి, చిరంజీవికి బొకే ఇచ్చి, స్నేహ‌పూర్వ‌కంగా క‌లిశారు. చిర‌కాల మిత్రుడు త‌న సినిమా సెట్స్‌కు రావ‌డంతో చిరంజీవి ఆనందంతో మోహ‌న్‌బాబును ఆహ్వానించారు. ఆ ఇద్ద‌రూ కొద్దిసేపు సినిమాల‌తో పాటు వివిధ అంశాల‌పై మాట్లాడుకున్నారు. మోహ‌న్‌బాబు ప్ర‌స్తుతం 'స‌న్ ఆఫ్ ఇండియా' మూవీ చేస్తున్నారు.



 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: