అబ్దుల్ సలాం కేసును వెంటనే సిబిఐకి అప్పగించాలి

లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్ నిరసన దీక్ష

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

   అబ్దుల్ సలాం కేసు ను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ వ్రాతపూర్వకంగా వెంటనే పంపించాలని కోరుతూ నంద్యాల పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్ నందు ఇక్రా స్కూల్ ఆవరణలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మౌలానా నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమానికి సిపిఐ సీనియర్ నాయకులు ఎస్. సలామ్ ఖాన్ కండువా కప్పి ప్రారంభించారు. ఈ సందర్భంగా లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహ్మద్  మాట్లాడుతూ. నంద్యాల పట్టణంలో రాజకీయ పోలీసుల వేధింపులకు గురై కుటుంబంతో సహాఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్ సలాం కేసును రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ద్వారా విచారణ జరిపించి కేంద్ర హోంశాఖకు వ్రాతపూర్వకంగా పంపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చర్చ జరుపుకుoడనే ఆమోదించిన రైతాంగ వ్యతిరేక చట్టాలను. విద్యుత్ సంస్థ చట్టాలను వ్యతిరేకిస్తూ గత ఇరవై తొమ్మిది రోజులుగా ఢిల్లీలో చలికి లెక్కచేయకుండా దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైతులు ఆందోళన లు నిర్వహిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం దారుణమని అన్నారు.


మూడు వ్యవ సాయ చట్టాలను మా రాష్ట్రంలో అమలు అనుమతించమని కేరళ ప్రభుత్వం మాధురి గానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని అన్నారు. అలాగే విద్యుత్ సంస్థ చట్టాన్ని గ్రామీణ. పట్టణ ప్రాంత వాసులు వేస్తున్న ఆస్తిపన్ను మురికి నీరు మంచి నీరు చెత్త మీద పన్నులను ఉపసంహరించుకోవాలని అని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్పీఆర్, ఎన్నార్సీ, సీఏఏ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ పోరాడిన ముస్లిం మైనార్టీ లపై ఇది దాడులు చేస్తూ దేశద్రోహం కేసు పెట్టడాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలకు. సిపిఎం. జిల్లా నాయకులు. ఎస్. మస్తాన్ వల్లి. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు యస్. బాబా ఫక్రుద్దీన్. జానో జాగో సంఘం జాతీయ కార్యదర్శి మహబూబ్ బాషా. పి డి ఎస్ యు జిల్లా నాయకులు ఎస్. ఎన్. డి. రఫీ. ఆవాజ్ కమిటీ అధ్యక్షుడు ఎస్ బాబులా.ఎంఆర్ఎఫ్.  అధ్యక్షుడు. ఎస్.మహబూబ్ బాషా. సామాజిక కార్యకర్త. సోహెల్ రానా. ఎం. హెచ్. పి.ఎస్. నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు. ఎస్. యూనుస్. ఐ యు  ఎం  ఎల్ జిల్లా కార్యదర్శి సలాం మోలాన.  పి వై ఎల్. జిల్లా నాయకులు నవీన్. భాష. సంఘీభావం తెలిపారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: