ఘనంగా వై.ఎస్.జగన్ పుట్టిన రోజు వేడుకల నిర్వాహణ


(జానోజాగో వెబ్ న్యూస్-తర్లుపాడు ప్రతినిధి)

 ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి అచ్యుతరావు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవ యువ నేత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అట్టహాసంగా నిర్వహించి, మండల తహసీల్దార్ పి .శైలేంద్ర కుమార్ మండల వైసిపి నాయకులు సూరెడ్డి. భూలక్ష్మి చేతుల మీదుగా కేక్ కట్ చేయడం జరిగింది. అధికారం చేపట్టిన 16 నెలలకు ఆంధ్ర ప్రజల ఆశాజ్యోతి గా నిలిచి పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహా నాయకుడు వై.యస్. జగన్మోహన్ రెడ్డి అని పలువురు ప్రశంసించారు.  ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి అచ్యుత రావు మాట్లాడుతూ రాష్ట్రంలో సరికొత్త విధానం ప్రవేశపెట్టి పరిపాలన విభాగాలు గ్రామ స్థాయిలకు ప్రవేశపెట్టి ప్రభుత్వం నుండి అమలు అయ్యే అన్ని సంక్షేమ పథకాలను చేరవేయడంలో గ్రామ సచివాలయం, వాలంటరీ వ్యవస్థలకు శ్రీకారం చుట్టి పరిపాలన సౌలభ్యాన్ని ప్రజలకు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ పి. శైలేంద్ర కుమార్, మండల వైసిపి నాయకురాలు సూరెడ్డి. భూలక్ష్మి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు


Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: