గ్రామ వార్డు సచివాలయలు అద్భుతంగా పని చేస్తన్నాయ్

 ఎంపి పోచా,  ఎమ్మెల్యే శిల్పా

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు జిల్లా ప్రతినిధి)

నంద్యాల నియోజకవర్గం లోని క్రాంతి నగర్ నందు ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదివారం  40 లక్షల రూపాయలతో నూతన వార్డు సచివాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయలు ప్రారంభించి ప్రజలకు అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా ఏర్పాటు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని, అలాగే సచివాలయాలు పని చేస్తున్నా ఉద్యోగస్తులు వాలంటరీల పనితీరును అభినందించ దగ్గ విషయమన్నారు. గ్రామ సచివాలయంలో మంచి యువతీ యువకులు అందరూ బాగ పనిచేస్తున్నారని కానీ తప్పులు లేకుండా ప్రతి లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అందించాలని తేలియజేశారు. అలాగే క్రాంతినగర్ లో మంచి నీటి సమస్యని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నల వల్ల ప్రజలు ఏంతో సంతోషంగా ఉన్నారని, ముక్యంగా ప్రవేట్ పాఠశాలలకు ధీటుగా  ప్రభుత్వ పాఠశాలలు తీర్చి దిద్దుతున్నారని కానీ తెలుగుదేశం నాయకులు అభివృద్దిని  అడుకోవడమే లక్షంగా వున్నారని ఆరోపించారు. పేదవారికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే దుర్మార్గంగా కోర్టుకు వెళ్లడం జరిగిందని కానీ ముఖ్యమంత్రి ఎన్ని ఆడంకులు ఎదురైన ప్రతి పేదవాడి ఇంటి కళ నెరవేర్చడం జరుగుతుందన్నారు. ఎంపి పోచా బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూనంద్యాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ఎంపి నిధులతో నంద్యాలను అన్నీ విధాలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు రామసుబ్బారెడ్డి, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి కృష్ణా రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, రామచంద్రా రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి, మనిమోహన్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి,  శివశంకర్ రెడ్డి, చంద్రమౌళి రెడ్డి వైయస్సార్ సిపి నాయకులు బాచం జగదీశ్వర్ రెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి. పెద్ద కొట్టాల శివనాగిరెడ్డి,  వైఎస్ఆర్సిపి నాయకులు,  కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: