ప్ర‌దీప్ వ‌ర్మ డైరెక్ష‌న్‌లో శ్రీ‌విష్ణు 

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

విల‌క్ష‌ణ‌ క‌థ‌ల‌తో, భిన్న త‌ర‌హా చిత్రాల‌తో, అభిన‌యానికి అవ‌కాశం ఉన్న పాత్ర‌ల‌తో దూసుకుపోతున్న శ్రీ‌విష్ణు.. ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా ఇంట‌రెస్టింగ్ సినిమాల‌కు సంత‌కం చేస్తూ వ‌స్తున్నారు. 'రాజ రాజ చోళ' సినిమా షూటింగ్ పూర్త‌వ‌గా, 'గాలి సంప‌త్' చిత్రం, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న టైటిల్ ఖ‌రారు చేయ‌ని సినిమా షూటింగ్‌లు ప్రోగ్రెస్‌లో ఉన్నాయి.
లేటెస్ట్‌గా, మ‌రో ఇంట‌రెస్టింగ్ ప్రాజెక్ట్‌కు శ్రీ‌విష్ణు అంగీకారం తెలిపారు. ప్ర‌దీప్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ చిత్రాన్ని ల‌క్కీ మీడియా బ్యాన‌ర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మించ‌నున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని రోల్‌లో శ్రీ‌విష్ణు క‌నిపించే ఈ యాక్ష‌న్ ఎమోష‌న‌ల్ డ్రామా ప్రి-ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. టాప్ టెక్నీషియ‌న్లు ఈ మూవీకి ప‌నిచేస్తున్నారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, శివేంద్ర సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మిగ‌తా టెక్నీషియ‌న్ల పేర్ల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. 2021 మొద‌ట్లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానున్న‌ది.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: