ప్రముఖ స్టేజ్ సింగర్ ఖాన్ అథర్...

గుండెపోటుతో మరణం

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

ప్రముఖ స్టేజ్ సింగర్ ఖాన్ అథర్ గుండెపోటుతో సోమవారంనాడు ఆకస్మిక మృతి చెందారు, విచారకరం! ఖాన్ గారిది అద్భుత స్వరం!  అంతకు మించి ఆయన గొప్ప మానవతా వాది!  బాలీవుడ్  పాటలంటే ప్రాణం!  రవీంద్రభారతి లో బాలీవుడ్  మ్యూజికల్ నైట్ అంటే ఖాన్ గారు ఉండాల్సిందే !  ఖాన్ గారి ఫోటో  పోస్టర్ లో ఉంటే టికెట్లు హాట్ కేకులే!  పాత హిందీ సినిమా పాటలకు అయన పెట్టింది పేరుగా  గుర్తింపు తెచ్చుకున్నారు!  గజల్స్ తో కూడా అభిమానులను తన్మయత్వం లో ముంచెత్తే  వారు! ఎంతో డిమాండ్ ఉన్నప్పటికీ, ఎప్పుడు ప్రొగ్రామ్ అని చెప్పిన ఎంత ఇస్తారు అని అడగరు!  ఇచ్చినంత  తీసుకుంటారు! పాడేటప్పుడే  కాదు, మాట్లాడేటప్పుడు కూడా ఆ నవ్వు చెదరదు!  మంచి మనసున్న అందగాడు!  పాటలే  అయన ప్రపంచం!  మా ఇంటి ఫంక్షన్ లో అయితే ఫ్రీ గా వచ్చి పాడి అలరించారు!  షుగర్ ఆయన్ని ఎంతగా ఇబ్బంది పెడుతున్నా పాటలకే  ప్రాధాన్యం ఇచ్చారు చివరి వరకు!  పాడుతూ వెళ్లిపోవాలని  పలు మార్లు చెప్పారు! రఫీ లా గొంతు అనుకరించి  అచ్చమ్ అలాగే పాడటం లో నేర్పరి! కరోనా మరో మంచి గాయకుడిని  బలి తీసుకుంది! స్నేహానికి పాటకు ప్రాణం ఇచ్చే ఖాన్ గారి మృతి మనసును కలచి వేస్తోంది!   రవీంద్రభారతి లో ఖాన్ గారు లేని సంగీత విభావరి ని జీర్ణించు కోవడం అభిమానులకు నాలాంటి ఆత్మీయులకు కష్టమే!  అశ్రు నివాళి

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: