హిందూ ముస్లిం సోదర దినోత్సవం

పండిట్ రాంప్రసాద్ బిస్మిల్.అశ్వాఖుల్లా ఖాన్ పుస్తకావిష్కరణ

(జానోజాగో వెబ్ న్యూస్-హిందూపురం ప్రతినిధి)

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని టీచర్స్ కాలనీలోని తపన సాహితీవేదిక ప్రాంగణంలో ముస్లిం నగారా&టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఉమర్ ఫారూఖ్ ఖాన్ ఆధ్వర్యంలో కవి రచయిత సడ్లపల్లి చిదంబర్ రెడ్డి అధ్యక్షతన హిందూ ముస్లిం సోదర దినోత్సవం సంధర్బంగా పండిట్ రాంప్రసాద్ బిస్మిల్ -అశ్వాఖుల్లా ఖాన్ (హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతిరూపాలు)పుస్తకావిష్కరణ కార్యక్రమము ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉమర్ ఫారూఖ్ ఖాన్ మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధులు కాకోరీ విప్లవ వీరులు షహీద్ అశ్వాఖుల్లా ఖాన్ రాంప్రసాద్ బిస్మిల్ లు హిందూ ముస్లిం స్నేహానికి నిలువెత్తు నిదర్శనమని వారు పేర్కొన్నారు.

వారి ని ఉరితీసిన రోజు ప్రతి సంవత్సరం హిందూ ముస్లిం సోదర దినోత్సవంగా జరుపుకొంటూ దేశ సుస్థిరతకు జాతీయ సమైక్యతకు దేశ అభివృద్ధికి మనమందరం మహనీయులను ఆదర్శంగా తీసుకొని వారు దేశాన్ని బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి విముక్తికై  జాతి కుల మత వర్గ వర్ణ బేధాలు పక్కనపెట్టి దేశాన్ని విముక్తి చేశారో ప్రస్తుతం కులోన్మాదం.మతోన్మాదం.జాతి ఉన్మాదం.ప్రాంతీయ వాదం.భాషా భేదాభిప్రాయాలను నిర్మూలించటానికి మనమంతా ఒకే తల్లి బిడ్డల్లా వసుధైక కుటుంబంలా సోదర భావం.మత సామరస్యం.పరమత సహనాన్ని పెంపొందించి ఆచరించటానికి ఉద్యమ రూపంలో సంస్కరణల కోసం పని చేయాలని విజ్ఞప్తి చేశారు అనంతరం పుస్తకావిష్కరణ చేశారు సోదర భావాన్ని పెంపొందిద్దాం.హిందూ ముస్లిం ల ఐక్యత వర్ధిల్లాలి. భారతీయుల ఐక్యత వర్ధిల్లాలి అని నినదించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ సుదర్శన్.కవి శొంఠి జయప్రకాష్.కవి గంగాధర్.మౌలానా జుబేర్.మౌలానా అబ్దుల్ మాలిక్.దండోరా సతీష్ కుమార్.తెలుగు భాషా ఉద్యమ కారులు ఏటిగడ్డ అశ్వర్థనారాయణ.కవి కల్లూరు రఘువేంద్ర రావు.తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


 

 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: