స్నేహలతను దారుణంగా చంపిన వారిని కఠినంగా శిక్షించాలి

 ఇన్షాఫ్ కమిటీ నంద్యాల డివిజన్ నాయకులు ఎస్.షరీఫ్ బాషా

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

దళిత అమ్మాయి స్నేహలతను దారుణంగా చంపిన వారిని కఠినంగా శిక్షించాలి ఇన్షాఫ్ కమిటీ డివిజన్ నాయకులు షరీఫ్ భాష డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ   నిన్నటి రోజున  అనంతపురం జిల్లా ధర్మవరంలో స్నేహలత అనే అమ్మాయి హత్యకు కారణమైనటువంటి నిందితులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జరిగింది పట్టించుకోకపోవడం చాలా సిగ్గుచేటు.పేరుకు మాత్రం దిశా నిర్భయ చట్టాలు అని చెప్పుకుంటూ అమలుచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో వైఫల్యం చెందిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో స్నేహలత వాళ్ళ అమ్మ గారుఅనంతపురం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ కు వెళ్లి మాకు నిందితుల  వల్ల అపాయంఉంది అని కేసు పెట్టండి అని వేడుకున్నా కేసు పెట్టకుండా వ్యవహరించినటువంటి సీఐ ఎస్ఐ  గారి పై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ అమ్మాయికి న్యాయం చేసి మరలా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని వారు అన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: