మోడీ పాలన ప్రజల కోసం కాదు....కార్పోరేటర్ల కోసమే

ఎంఐఎం కర్నూలు పట్టణ అధ్యక్షులు మన్సూర్ బాషా

భారత్ బంద్ సందర్భంగా ఎంఐఎం ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

(జానోజాగో వెబ్ న్యూస్-కర్నూలు పట్టణ ప్రతినిధి)

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ పాలన పేద ప్రజల కోసం కాకుండా కార్పోరేట్ వ్యవస్థల కోసం సాగుతోందని ఎంఐఎం కర్నూలు పట్టణ అధ్యక్షులు మన్సూర్ బాషా విమర్శించారు. దేశానికి అన్నంపేట్టే అన్నధాత వ్యతిరేక బిల్లులను తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం తీరే ఇందుకు నిదర్శనమన్నారు. సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ అని అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం తొలినుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అవలంభిస్తోందని విమర్శించారు.

కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక బిల్లులను ఎంఐఎం పార్టీగా తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీరు మారకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఇదిలావుంటే భారత్ బంద్ లో భాగంగా మంగళవారంనాడు కర్నూలు పట్టణంలో ఎంఐఎం నేతలు, కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం నేతలు మన్సూర్ బాషాతోపాటు సయక్యద్ బాషా, మజహర్, అమీర్, షబ్బీర్ ఖాన్, ఇంబ్రహీం, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు.

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: