రైతులే కాదు.. దేశభక్తిగల ప్రతి పౌరుడూ కదలాలి..

వ్యవసాయ చట్టాలతోపాటు విద్యుత్‌ సవరణ చట్టాలపైనా పోరాడాలి

అన్నదాతల పోరాటానికి అండగా నిలబడదాం

రైతు బహిరంగ సభలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని

వామపక్షాలు, టీజేఎస్‌ సంఘీభావం

17వ రోజుకు ఆందోళన పోటెత్తిన రైతులు

(జానోజాగో వెబ్ న్యూస్-తెలంగాణ ప్రతినిధి)

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేవలం రైతులేగాక... దేశభక్తిగల ప్రతి పౌరుడూ ఉద్యమించాలని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాలతోపాటు విద్యుత్‌ సవరణ చట్టాలను సైతం వ్యతిరేకించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ఆందోళనకు మద్దతుగా బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించారు. అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి తమ్మినేనితోపాటు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, ఆ పార్టీ మాజీ ఎంపీ అజీజ్‌పాషా, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నేత పోటు రంగారావు, తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ శాసన సభ్యులు నంద్యాల నర్సింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, పట్నం రాష్ట్ర కార్యదర్శి డి.జి నర్సింహ్మారావు, తదితరులు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సభకు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరయ్యారు.

ఏఐకేఎస్‌సీసీ సభ్యుడు సుఖ్‌వీర్‌సింగ్‌, రాష్ట్ర కన్వీనర్లు తీగల సాగర్‌, పశ్య పద్మ, రాయల చంద్రశేఖర్‌, విస్సా కిరణ్, అచ్యుత రామారావు, వల్లపు ఉపేంధర్‌రెడ్డి, కన్నెగంటి రవి, సాయన్న, ఐలు రాష్ట్ర ఉపాధ్యక్షులు పార్థసారథి, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాదినేని లక్ష్మీ, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ధర్మానాయక్‌, శ్రీరాం నాయక్‌, వ్యకాస రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకటరాములు, సిపిఐ(యం) నగర కార్యదర్శి యం. శ్రీనివాస్‌, విమల, సంధ్య, గోవర్ధన్‌, గుమ్మడి నర్సయ్య, మురహరి, రాఘవచారి, వెంకటయ్యలతోపాటు ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ... రైతుల్ని ఆహార పంటల నుంచి వ్యాపార పంటల వైపు మళ్లించేందుకు మోడీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా వరి, గోధుమలు కాకుండా పత్తి, మిర్చి, పసుపు తదితర వాణిజ్య పంటలేయాలంటూ రైతుల్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. అయితే ఇలాంటి వాణిజ్య పంటలేసిన రైతులు ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని గుర్తు చేశారు. పెట్టుబడి ఎక్కువ కావటం, నామమాత్రపు ధర కూడా ఆయా పంటలకు రాకపోవటం దీనికి ప్రధాన కారణమన్నారు. వ్యవసాయ చట్టాలు అమలైతే రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్త చర్చ జరుగుతున్న క్రమంలో మున్ముందు విద్యుత్‌ సవరణ చట్టాల ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పారు. వీటి వల్ల ప్రస్తుతం అమలవుతున్న క్రాస్‌ సబ్సిడీ ఉండబోదనీ, విద్యుత్‌ ఉత్పత్తికి ఎంత ఖర్చయితే అంత మొత్తాన్ని వినియోదారుడి నుంచి వసూలు చేస్తారని వివరించారు. తద్వారా ప్రజలపై పెను భారాలు మోపనున్నారని హెచ్చరించారు. అందువల్ల దేశంలోని ప్రతీ పౌరుడూ వీటిని నిర్వందంగా తిరస్కరించాలని పిలుపునిచ్చారు. రైతులతో భుజం భుజం కలిసి సీపీఐ (ఎం) పోరాడుతుందని హామీనిచ్చారు.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: