జాతీయ  అవార్డుకు పాత్రికేయుల ఎంపిక 

(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)

ప్రతిష్ఠాత్మక జాతీయస్థాయి జనసేవ సద్భావన పురస్కారానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కు చెందిన  సీనియర్ పాత్రికేయులు కొండపనేని  ఉమా మహేశ్వరరావు, మహ్మద్ రఫీ ఎంపికయ్యారు. ఢిల్లీ భారత వికాస్ పరిషత్ వారు సామాజిక కళ ఆధ్యాత్మిక సాంస్కృతిక సేవా రంగాలలో  విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ప్రతి ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక  జాతీయస్థాయి జనసేవ సద్భావన పురస్కారానికి    సమాజ సేవకులు సీనియర్ సినీ జర్నలిస్ట్ రామోజీ ఫిలిం సిటీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా వ్యవహరిస్తున్న కె.ఉమా మహేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు, కళ పత్రిక సంపాదకులు డాక్టర్ మహ్మద్ రఫీ ఎంపికయినట్లు  ప్రకటించారు.

   2020 సంవత్సరానికి దేశం లోని వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న 22 మందిని ఎంపిక చేయగా, అందులో తెలంగాణ నుంచి ఇద్దరు పాత్రికేయులు ఉండటం  విశేషం. ఈనెల 19న దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర మంత్రుల చేతుల మీదుగా  ఈ ప్రతిష్టాత్మక అవార్డును వీరు  అందుకోనున్నారు. గత 30 సంవత్సరాలుగా విద్య కళ సాంస్కృతిక ఆధ్యాత్మిక సామాజిక సేవా రంగాలలో వీరు  అందిస్తున్న విశిష్ట సేవలకు గాను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని భారత్ వికాస్ పరిషత్ ప్రతినిధులు తెలిపారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: