మురికి నివారణ చర్యలు చేపట్టండి

మున్సిపల్ కమిషనర్ కు ముస్లిం హక్కుల పోరాట సమితి వినతి

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

నంద్యాల పట్టణంలో బాల బాలిక హై స్కూల్ లో రోడ్డుపై మురికి నీళ్లు వరదలా పారుతుంది ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు ఎస్.ఎం.డీ.యూనుస్ పేర్కొన్నారు. ఈ మేరకు సమస్యలతో కూడిన మెమోరాండంను నంద్యాల మున్సిపల్ కమిషనర్ కు ఆయన సమర్పించారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కరిచాలని కమిషనర్ ను ఆయన కోరారు. ఆ మెమోరాండంలో ఇలా పేర్కొన్నారు.... నంద్యాల ఆర్టీసీ బస్టాండ్. విక్టోరియా రీడింగ్ రూమ్ దగ్గర ఉన్న చిన్నమయ్య విద్యాలయం లాక్ డౌన్ కరోనా సమయం ఉండటం తో 9. వ తరగతి 10. వ తరగతి 8వ తరగతి విద్య బోధనలు ప్రారంభం అయినా సందర్బంగా అక్కడ స్కూల్ కు వెళ్లే విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురిఅవుతున్నారు.
స్కూల్ ఆవరణలో ఆటోల ఇబ్బంది లోనికి వచ్చే దారి కాలువలు నిండి మురికి వాసన కుళ్ళిన వాసనా తట్టుకోలేక పోతున్న విద్యార్థులు స్కూల్ టీచర్స్ ఎవరికీ చెప్పిన ప్రవీయోజం లేదు అన్నే ధోరణి అధికారులు వెంటనే స్పందించిఅక్కడ వ్యాపారం చేస్తున్న హోటల్ యాజమాన్యంవారు వేసే మురికి నీరు స్కూల్ ముందుకు వచ్చి ఆగటం వలన స్కూల్ కు వెళ్లే పిల్లలు రోగాల బారిన పడకుండ కాపాడవలసినదిగా మున్సిపల్ అధికారులకు ఆ ఏరియా సచివాలయఉద్యోగులకు వేడుకుంటున్నాము అయ్యా మీరు వెంటనే స్పందించి చిన్న పిల్లలఆరోగ్యం కాపాడవలసిందిగా కోరుకుంటున్నాము. అని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నందమూరి నగర్ నూర్ భాష, అబ్బాస్ అలీ, హనీఫ్, మహమ్మద్ కైఫ్ తదితరులు పాల్గొన్నారు.


 

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: