విద్యాసంస్థల బంద్ విజయవంతం 

పీడిఎస్ యూ, పీవైఎల్

(జానోజాగో వెబ్ న్యూస్-నంద్యాల ప్రతినిధి)

దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు రైతు సంఘాలు నాయకులు పిలుపు మేరకు నంద్యాల పట్టణంలో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ యూ, ప్రగతిశీల యువజన సంఘం(పీవైఎల్) సంఘాల ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గా పిడిఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.ఎం.డీ.రఫీ, పి వై ఎల్ జిల్లా నాయకులు నవీన్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కు నంద్యాల పట్టణంలో ఉన్న ఎల్ కేజీ నుంచి పీజీ వరకు సహకరించిన విద్యాసంస్థల యాజమాన్యం మరియు విద్యార్థి తల్లిదండ్రులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా గత కొన్ని రోజుల నుండి ఢిల్లీలో రైతులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.దేశానికి వెన్నెముక లాంటి రైతులను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టే విధంగా కొత్త చట్టాలను పార్లమెంట్లో తీసుకోవడం జరిగింది. బిజెపి ప్రభుత్వం దేశాన్ని మొత్తం కూడా కార్పొరేట్ చేతిలో అప్పచెప్పే విదంగా వ్యవహరిస్తున్నారు.ఇప్పటికే దేశవ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ నగరంలో చేరుకొని ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రైతులకు శాపంగా మారిన 3చట్టాలను రద్దు చేయకపోతే ప్రజలందరూ కూడా తిరగబడి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రజలు పునుకుంటారని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఇప్పటికే శాంతియుతంగా రైతులందరూ ఆందోళన చేస్తుంటే వాళ్ల సమస్యలు పరిష్కరించకుండా దేశానికి అన్నం పెట్టే రైతులను కేంద్ర ప్రభుత్వం వాటర్ క్యాను భాష్ప వాయువు పోలీసుల చేత రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మీరు ఎన్ని ఇబ్బందులు చేసిన మేం వెనక్కి తగ్గే పరిస్థితి లేదని దేశ వ్యాప్తంగా రైతులు ఢిల్లీలొనే ఆందోళన చేస్తున్నారు.తక్షణమే రైతు చట్టాలను ఉపసంహరించుకోకపోతే పెద్దఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతమని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఐ.ఎం.  నంద్యాల అధ్యక్షులు అక్బర్, పిడిఎస్ యూ నాయకులు అఖిల్, దస్తగిరి,షాకేర్, శివ,నాయక్ తదితరులు పాల్గొన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: