సమస్యలు పరిష్కారం కొరకు సమాచార హక్కు చట్టం ...

మాజీ చీఫ్ కమీషనర్ డా.వర్రె వెంకటేశ్వర్లు

(జానోజాగో వెబ్ న్యూస్-ఆలేరు ప్రతినిధి)

సమస్య పరిష్కారం కొరకు సమాచార హక్కు చట్టం పనిచేస్తుందని సమాచార హక్కు చట్టం మాజీ చీఫ్ కమీషనర్ డా.వర్రె వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం మండల కేంద్రము లో ప్రేమ సేవా సదనం ఆద్వర్యంలో సమాచార హక్కు చట్టం పై అవగాహన సదస్సు, ఆకవరం వెంకటమ్మ , లక్ష్మణ్ రావుల జ్ఞాపకార్థం గా మున్సిపల్ కార్మికులకు ఉలన్ స్వెటర్ లను కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిదిగా హాజరై మాట్లాడుతూ అవినీతి అనిచివేతకు సమాచార హక్కు చట్టం ను నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం  చేసుకోవాలన్నారు. జరుగుతున్న అభివృద్ధి పనులు, గతంలో జరిగిన పనులపై ఈ చట్టం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. ఈ చట్టం ద్వారా పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలు, కేసులు గతంలో పరిష్కారం అయ్యాయని తెలిపారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు స్వెటర్ లు అందచేశారు. ఈ కార్యక్రమం లో డా.తిప్పర్తి యాదయ్య, చలకాని వెంకట్ యాదవ్, అయిల కొమరయ్య, ఆకవరం మోహన్ రావు, మహమద్ ఖుర్షీద్ పాష, గుత్తా శమంతా, ఏర్పుల శ్రీనివాస్, కోరుకొప్పుల మల్లేశం, చెక్కిల్ల మోహన్, దూడం మదు, మహ్మద్ బాబు, గాదె సోమిరెడ్డి, వెంకటేశ్, శివలింగం తదితరులు ఉన్నారు

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: