పన్నుల భారాలపై సిపిఎం నిరసన
ఆర్డినెన్సు,జీవో కాపీల దగ్ధం..
నిరసన ప్రదర్శనలో ప్రసంగిస్తున్న ఎల్ మోహనరావు
(జానోజాగో వెబ్ న్యూస్-విజయవాడ ప్రతినిధి)
నగర వాసులపై పన్నులు భారం వ్యతిరేకంగా బుధవారం ఉదయం ఊర్మిళ నగర్ లో సి పి ఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నిరసనలో పాల్గొన్న సిపిఎం పార్టీ పశ్చిమ నగర సభ్యులు ఎల్ మోహన్ రావు పాల్గొనిమాట్లాడుతూ చెత్తపై పన్ను వసూలు చేయాలని ఏ చట్టం చెబుతోంది? నోటీసులు చట్టవిరుద్ధం.విజయవాడలో చెత్త పన్ను నెలకు వంద రూపాయలు చెల్లించాలని నగరపాలక సంస్థ అధికారులు నోటీసు ఇవ్వటం పై మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల పై పన్నుల తోనూ ధరలు పెంచడంతో భారాలు మోపి ప్రభుత్వ పాలన చేయడం సిగ్గు చేటని ఎద్దేవాచేశారు ఒకపక్క అందుబాటులో లేని నిత్యవసర వస్తువుల ధరలు కరోనా కారణంగా చాలీచాలని పనులు జీతాలు. ప్రేక్షక పాత్ర వహిస్తున్న ప్రభుత్వాలు.ధరల అదుపుకు ప్రభుత్వాలు చర్యలు ఎక్కడా కనిపించడం లేదని విమర్శలు గుప్పించారు. కూరగాయల ధరలు అన్ని కిలో 50 రూపాయలు పైనే ఉన్నాయి. రోజుకి కనీసం 100 రూపాయలు చొప్పున నెలకు మూడు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి.నిత్యావసర వస్తువుల ధరలు అందు బాటులో లేకుండా పెరిగి పోయాయని పేదవారికి బతుకే భారమవుతున్న నీటి పరిస్థితి లో . కేంద్ర ప్రభుత్వమే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని మోహన్ రావు ధ్వజమెత్తారు విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడింది. రేషన్ బియ్యం నాణ్యత లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.కరోనా సమయంలో పౌష్టిక ఆహారం కొరకు కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు అధికంగా తీసుకోవాల్సిన సమయంలో కూరగాయల రేట్లు పెరగడం గమనార్హం. ఒకవైపున ఉపాధి లేక ఆదాయాల తగ్గి ప్రజలు సతమతమవుతున్న ఈ సమయంలో ధరల పెరుగుదల ప్రజల్ని మరింత కుంగదీస్తుందని, ఈ స్థితిలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయని ఘాటుగా విమర్శించారు .ఈ క్లిష్ట సమయంలోనూ పన్నులు పెంచి ఖజానా నింపుకునే పనిలో ప్రభుత్వాలు ఉన్నాయి ఈ స్థితిలో రేషన్ డిపో లో బియ్యం బదులు నగదు బదిలీ చేస్తామని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు వస్తున్నవార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు .చిరు వ్యాపారుల పై కూడా వృత్తి పన్ను భారాన్ని మోపడం శోచనీయం. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలపై ఇంటిపన్ను మంచి నీటి పన్ను డ్రైనేజీ చెత్త పనులు అని చెప్పి భారాలు మోపుతూ ఆర్డినెన్స్ తీసుకురావడం సిగ్గుచేటని అన్నారు. ఈ కార్యక్రమంలో శాఖా కార్యదర్శులు అప్పలరాజు, రాంబాబు ,బిల్లింగ్ వర్కర్స్ ప్రధాన కార్యదర్శి పెద్దిరాజు, డివైఎఫ్ఐ కార్యదర్శి కే శివారెడ్డి, ట్రాక్టర్ యూనియన్అధ్యక్ష కార్యదర్శులు సైదులు ,వెంకటేశ్వరరావు, పార్టీ సభ్యులు బి నరసింహారావు, ఎస్.కె మస్తాన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: