నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఆవిష్క‌రించిన...

కె. వి గుహ‌న్ `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` టైటిల్ లోగో

(జానోజాగో వెబ్ న్యూస్-సినిమా బ్యూరో)

`118` వంటి సూప‌ర్‌హిట్  చిత్రాన్నితెర‌కెక్కించిన ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కేవి గుహ‌న్ రెండో చిత్రంగా ఒక  డిఫ‌రెంట్  థ్రిల్ల‌ర్ `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` (హూ,వేర్‌,వై)ని రూపొందిస్తోన్న విష‌యం తెలిసిందే.. అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నఈ మూవీని రామంత్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై డా. ర‌వి పి. రాజు దా‌ట్ల నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్నఈ సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ చిత్రం టైటిల్ లోగోను డేరింగ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ రిలీజ్ చేశారు. ఈ సంద‌ర్భంగా..

డేరింగ్ హీరో నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మాట్లాడుతూ - `గుహ‌న్ గారు చాలా పెద్ద టెక్నీషియ‌న్‌. ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌ జ‌ర్నీ నా`118` సినిమాతో ప్రారంభ‌మైనందుకు హ్యాపీగా ఉంది. నా కెరీర్‌లో ఒక మెమ‌ర‌బుల్ హిట్ ఇచ్చారు. నాకు అత్యంత ఆప్తులు. ఆయ‌న ఏం చేసినా స‌క్సెస్ అవ్వాల‌ని మ‌న‌స్పూర్తిగా కోరుకుంటాను. గుహ‌న్ గారు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన`డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` మూవీ టైటిల్ లోగోని రిలీజ్ చేయ‌డం ఆనందంగా కాదు భాధ్య‌త‌గా ఫీల‌వుతున్నాను. ఈ సినిమా క‌థ విన్నాను. చాలా బాగుంది. త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంద‌ని ఆశిస్తున్నాను`` అన్నారు.

ద‌ర్శ‌కుడు కెవి గుహ‌న్ మాట్లాడుతూ - ``న‌న్ను, నా క‌థ‌ను న‌మ్మి నాకు ద‌ర్శ‌కుడిగా మొద‌ట‌ అవ‌కాశం ఇచ్చిన‌ క‌ళ్యాణ్‌రామ్ గారి పేరు నా త‌దుప‌రి చిత్రానికి కూడా ఏదో ర‌కంగా ఉండ‌డం సెంటిమెంట్‌గా భావించి`డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` టైటిల్ లోగోని క‌ళ్యాణ్ రామ్ గారితో రిలీజ్ చేయించ‌డం జ‌రిగింది. బిజీ షెడ్యూల్‌లో కూడా నా కోసం స‌మ‌యం కేటాయించిన క‌ళ్యాణ్ రామ్ గారికి ధ‌న్య‌వాదాలు`` అన్నారు.

చిత్ర నిర్మాత‌ డా. ర‌వి పి.రాజు దా‌ట్ల మాట్లాడుతూ - ``మా రామంత్ర క్రియేష‌న్స్ బేన‌ర్‌లో రూపొందుతోన్నతొలిచిత్రం టైటిల్ లోగోని పోస్ట‌ర్‌ని నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ గారు రిలీజ్‌చేయ‌డం శుభ‌సూచ‌కంగా భావిస్తున్నాం. గుహ‌న్ గారు ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. ఆడియ‌న్స్‌ని 100% ఈ చిత్రం థ్రిల్ చేస్తుంది. థ్రిల్ల‌ర్స్‌లోనే ఇది ట్రెండ్‌సెట్ట‌ర్ అవుతుంది`` అన్నారు.

హీరో అధిత్ అరుణ్ మాట్లాడుతూ - ``న‌ట‌న‌నే ప్రాణంగా భావించే నంద‌మూరి కుటుంబంలోని యువ క‌థా నాయ‌కుడు క‌ళ్యాణ్‌రామ్ గారు మా మూవీ టైటిల్ లోగోను రిలీజ్ చేసి నందుకు హ్యాపీగా ఉంది. ఆయ‌న‌కి ఎప్పుడూ నేను ఋణ‌ప‌డి ఉంటాను.నా కెరీర్‌కి గుహ‌న్ గారు ఈ చిత్రంతో ట‌ర్నింగ్ పాయింట్ ఇస్తున్నారు. డెఫినెట్‌గా సినిమా సూప‌ర్‌హిట్ అవుతుంది`` అన్నారు. 

హీరోయిన్ శివాని రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ - ``క‌ళ్యాణ్ రామ్ గారు మా ఫ్యామిలీకి అత్యంత స‌న్నిహితులు. ఆయ‌న చేతుల మీదుగా నా మూవీ టైటిల్ లోగో విడుద‌ల‌కావ‌డం సంతోషంగా ఉంది. క‌ళ్యాణ్ రామ్ గారి విషెస్‌తో ఈ చిత్రం విజ‌యం మీద నాకు కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగింది. గుహ‌న్‌గారి డైరెక్ష‌న్‌లో ఓ థ్రిల్లింగ్ క్యారెక్ట‌ర్ చేయ‌డం నా అదృష్టం`` అన్నారు.

కో-ప్రొడ్యూస‌ర్‌ విజ‌య్ ధ‌ర‌ణ్ దట్ల మాట్లాడుతూ - ``మంచి మ‌న‌సున్న క‌ళ్యాణ్ రామ్‌గారు మా టైటిల్‌లోగోని ఆవిష్క‌రించ‌డం చాలా ఆనందంగా ఉంది. త‌ప్ప‌కుండా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది``అన్నారు

అథిత్ అరుణ్‌, శివాని రాజ‌శేఖ‌ర్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రానికి

బ్యాన‌ర్‌: రామంత్ర క్రియేష‌న్స్,

సంగీతం: సిమ‌న్ కె. కింగ్‌,

ఎడిటింగ్‌: త‌మ్మిరాజు,

డైలాగ్స్‌: మిర్చికిర‌ణ్‌,

కొరియోగ్ర‌ఫి: ప‌్రేమ్ ర‌క్షిత్,

కో-ప్రొడ్యూస‌ర్‌: విజ‌య్ ధ‌ర‌ణ్ దాట్ల,నిర్మాత‌: డా. ర‌వి పి.రాజు దాట్ల,క‌థ‌, సినిమాటోగ్ర‌ఫి, ద‌ర్శ‌క‌త్వం: కేవి గుహ‌న్‌.

Axact

Axact

Vestibulum bibendum felis sit amet dolor auctor molestie. In dignissim eget nibh id dapibus. Fusce et suscipit orci. Aliquam sit amet urna lorem. Duis eu imperdiet nunc, non imperdiet libero.

Post A Comment:

0 comments: