విద్యా వ్యాపారాన్ని అరికట్టండి

ఆర్ ఐ ఒ  సూపరిండెంట్ కి వినతి

పీ డీ ఎస్ యూ జిల్లా అధ్యక్షుడు జునైద్ బాషా డిమాండ్


 

(జానో జాగో వెబ్ న్యూస్- నంద్యాల ప్రతినిధి)

 నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా  ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలు ఫీజులు వసూళ్లు చేస్తున్నారని,వారిపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీ డీ ఎస్ యూ) జిల్లా అధ్యక్షుడు జునైద్ బాష,డిమాండ్ చేశారు. అనంతరం కర్నూలు నగరంలో ఆర్ఐవో కార్యాలయం నందు ఆర్ ఐ ఓ సుపెరిండెంట్ అన్నపూర్ణ కి సమస్యలతో కూడిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు జునైద్ బాష మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలలో  ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తు,అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నారని,అలాంటి కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కార్పొరేట్ కళాశాలలు నారాయణ శ్రీ చైతన్య కళాశాలలు ఆన్లైన్లో క్లాసుల పేరుతో అక్రమంగా తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్నవారిపై అలాంటి వారిపై ఎన్నిసార్లు నోటీసు ఇచ్చిన క్రమం తప్పకుండా అధిక ఫీజులు వసూళ్లు చేస్తున్న,విద్యను వ్యాపారంగా నిర్వహిస్తున్న కళాశాలను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా సరైన వసతులు, ఫైర్ సర్టిఫికేట్ లేని కళాశాలల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ఆన్లైన్ తరగతుల పేరుతో పాఠ్యపుస్తకాలు విద్యార్థులు తీసుకోవాలని కళాశాల యాజమాన్యం విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పై సమస్యలు పరిష్కరించలేని యెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యు జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ ఏం డి రఫీ ఉపాధ్యక్షుడు కె.నాగరాజు,నవీన్ కుమార్,ఈశ్వర్ పాల్గొన్నారు....

Axact

Jaano Jaago

ఆన్‌లైన్ తాజా తెలుగు వార్తలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ | jaanojaago.com

Post A Comment:

0 comments: