డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విచారణకు సిద్దం
(జానోజాగో వెబ్ న్యూస్-హైదరాబాద్ బ్యూరో)
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదు ప్రక్రియను సోమవారం నుంచి పోలీసులు మళ్లీ డ్రైవ్ ప్రారంభించారు. ఈ కేసుల విచారణ ప్రక్రియ కోసం హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్ లకు చెందిన అన్ని కోర్టులు సిద్దం చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నమోదు ప్రక్రియను ఆపిన విషయం విధితమే. కొత్త సంవత్సరం వేడుకలకు అనుమతులు లేవని ఇటీవలే పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అన్ని చెక్ పాయింట్ల వద్ద పోలీసులు మళ్లీ డ్రైవ్ చేస్తోంది. దీంతో అధికంగా కేసులు నమోదు అయ్యే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు కోర్టులు రంగం సిద్ధం చేస్తోంది. లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, ప్రత్యేక దళాలు, టీ ఎస్ పి ఎఫ్, తో పాటు అన్ని బలగాలు చెక్ పాయింట్ల వద్ద మోహారించనున్నారు. ఐ పిసి 304 కింద కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తాగి వాహనాలు నడిపిన వారిని "" టెర్రరిస్టు"" గా గుర్తించడం జరుగుతుంది అని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. కోర్టులు సైతం కఠిన నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
Post A Comment:
0 comments: