అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలి
సిపిఎం డిమాండ్
(జానోజాగో వెబ్ న్యూస్-నందికొట్కూర్ ప్రతినిధి)
అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం నాగేశ్వరరావు, నాయకులు పి పకీర్ సాహెబ్ డిమాండ్ చేశారు, బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్ కాలనీలో ఉన్న 9వ సచివాలయం ముందు ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సీపీఎం నాయకులు పి మరి స్వామి అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా ఎం నాగేశ్వరరావు పి పకీర్ సాహెబ్ మాట్లాడుతూ తూ, ఈనెల 25 నుండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు ప్రతి పేదవాడికి ఇల్ల పట్టాలు ఇచ్చే బాధ్యత తమది అని చెబుతున్నా అధికారులు మాత్రం స్థానిక నాయకులు కావాలనే అర్హులైన పేదలకు పక్కనపెట్టి అధికార పార్టీకి వంతపాడే వారికి వారి బంధువులకు మాత్రమే ఇంటి స్థలాలు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నించారు.
వైసీపీ నాయకులు వారి కుటుంబ సభ్యులకు బంధువులకు మాత్రమే ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్నారని వారు విమర్శించారు , బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నగర్ లో అర్హులైన పేదలు ఉన్న ఇంటి పట్టాలు ఇవ్వలేదని వారు ఆరోపించారు, ఇప్పటికైనా అధికారులు స్పందించి అనర్హులను తొలగించి అర్హులందరికీ ఇంటి పట్టాలు ఇవ్వాలన్నారు లేనిపక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అర్హులైన పేదలను సమీకరించి సచివాలయాన్ని దిగ్బంధం చేస్తామని వారు హెచ్చరించారు అనంతరం సచివాలయ అధికారి రవి కుమార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో జమలయ్య, సుబ్బమ్మ, లక్ష్మీదేవి, గౌసియా, మస్తానీ, వసంత అమ్మ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: